మార్కెట్లో కొత్త ఫోన్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఫోన్ల కంపెనీలన్నీ వీలైనన్ని ఎక్కువ ఫోన్లను రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా మార్కెట్లోకి వచ్చింది వన్ ప్లస్ 3 ఆండ్రాయిడ్ ఫోన్. వన్ ప్లస్ మొబైల్స్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఫ్లాగ్‌షిప్ స్మార్టుఫోన్ అనుభవాన్ని వినియోగదారులకు అందించడానికి వన్ ప్లస్ 3ని మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు ఈ సంస్థ తెలిపింది. గతంలో తమ కంపెనీ విడుదల చేసిన వన్ ప్లస్ 1, 2 ఫోన్లకు లేని ఫీచర్లు ఈ ప్లస్ 3 ఫోన్లో ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ ఆప్షన్‌తో పాటు మెటల్ యూనీబాడీ ఈ ఫోన్ ప్రత్యేకత. గత ఫోన్లకు ఉన్న సాండ్ స్టోన్ ఫినిషింగ్ ఉన్న రేర్ ప్యానల్ స్థానంలో తయారైన కోల్డ్, హార్డ్ అల్యూమినయం ప్యానల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. ఆప్టిక్ ఏఎంఓ ఎల్ఈడీ టచ్‌స్క్రీన్‌తో ఈ ఫోన్ అందరికి నచ్చేలా తయారైంది. ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో సాఫ్ట్‌వేర్‌తో రూపొందిన ఈ ఫోన్లో చిప్ సెట్‌ను క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 820 వెర్షన్‌తో తయారు చేశారు. డ్యుయల్ కోర్ 2.15 గిగా హెట్జ్ క్రయోతో దీన్ని రూపొందించారు. 6 జీబీ ర్యామ్ సామర్థ్యం ఉన్న ఈ ఫోన్‌లో మెమెరీ 64 జీబీ ఉంది. దీనికి ఎలాంటి మెమెరీ స్లాట్ లేదు. 16 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెకండరీ కెమెరా ఈ ఫోన్‌లో ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ దీనిలో ఉన్న మరో ఆప్షన్. దీని వల్ల మన డేటా బయటకి వెళుతుందనే ఆందోళన కూడా అవసరం లేదు. ఆర్‌డబ్ల్యూ ఇమేజ్ సపోర్ట్, 4 కె వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు స్మైల్ కాప్చర్ మోడ్ లాంటి ఆప్షన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 1080పీతో వీడియో రికార్డింగ్ ఎంతో క్లారిటీగా ఉంటుంది. ఒన్ ప్లస్ 3 ఫోన్ 4జీ ఎల్‌టీఈ క్యాట్.6 కనెక్టివిటీని ఆఫర్ చేస్తుంది. నాన్ రిమూవబుల్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఛార్జీంగ్ కూడా ఎక్కువసేపు నిలుస్తుంది. 158 గ్రాముల బరువున్న ఈ ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ టెకాల్నజీతో తయారు కావడం వల్ల వేగంగా ఛార్జింగ్ అవుతుంది. దీనిలో ఉన్న రెండు ఆధునాతన స్టెబిలైజేషన్ వల్ల అకస్మాత్తుగా సంభవించే షాక్‌ల నుంచి రక్షిస్తుంది. |