• తాజా వార్తలు

ఆన్ లైన్ షాపింగ్ లో ధరల వ్యత్యాసాన్ని నిగ్గు తేల్చే మరొక యాప్ - షాప్ సింక్

ఆన్ లైన్ షాపింగ్ లో ధరల వ్యత్యాసాన్ని నిగ్గు తేల్చే మరొక యాప్  “షాప్ సింక్”

ఆన్ లైన్ షాపింగ్ లో మనకు ఈ రోజు దొరకని వస్తువంటూ ఏదీ లేదు. ఆన్ లైన్ మార్కెటింగ్ సైట్ లకు కూడా కొదువ లేదు. వీటి సంఖ్య కూడా పదుల సంఖ్య లో ఉంది. అన్ని వస్తువులనూ దాదాపు అన్ని సైట్ లూ అందిస్తాయి. ఒక్కో సైట్ లో ఒక్కో ధర వీటికి ఉంటుంది. మరి ఏ సైట్ లో ఎంత ధర ఉందొ తెలుసుకోవలంటే అది పెద్ద తతంగం అనీ ప్రక్రియ అంతా అవసరం లేకుండా ఆన్ లైన్ ధరల వ్యత్యాసాన్ని తెల్సుకునే యాప్ లు చాలా ఉన్నాయనీ మనం క్రితం ఆర్టికల్ లో తెలుసుకున్నాము. అలంటి సైట్ లలో ఒకటి అయిన ఊడూ యాప్ గురించి కూడా మనం సమగ్రంగా తెల్సుకున్నాము.  అలాంటిదే మరొక యాప్ షాప్ సింక్ యాప్. ఈ యాప్ కు ఉండే ప్రత్యేకతల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

మిగతా ప్రైస్ కంపారిజన్ యాప్ లతో పోల్చితే ఈ షాప్ సింక్ యాప్ కొంచెం విభిన్నంగా ఉన్నది. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమజాన్ లు అందించే వస్తువుల ధరలలో ఉండే వ్యత్యాసాన్ని ఇది అందిస్తుంది. వీటితో పాటు అదనంగా ఇది ఒక చాటింగ్ ఫ్లాట్ ఫాం ను కలిగి ఉంటుంది. దీని ద్వారా మీరు కొనాలి అనుకున్న వస్స్తువు ను మీ స్నేహితులకూ, సన్నిహితులకూ చూపించి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని దాన్ని బట్టి కొనుగోలు చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యాప్ పై మూడు అమ్మకందారులకే పరిమితం అయినా భవిష్యత్ లో దీనిని మరిన్ని సైట్ లకు విస్తరించే ఆలోచనలో దీని యాజమాన్యం ఉన్నది.

ఈ షాప్ సింక్ యాప్ ద్వారా ఏదైనా కొనాలి అని మీరు అనుకున్నపుడు ముందుగా ఇన్స్టాల్ చేయబడిన ఆ యాప్ లో ఒక బయ్ బటన్ ఉంటుంది. ఇది మీరు కొనాలి అనుకున్న వస్తువు మరియు సైట్ యొక్క పూర్తీ వివరాలను లోడ్ చేస్తుంది. దీనితో పాటు దాని ధర మిగతా సైట్ లలో ఎంత ఉందొ ప్రోడక్ట్ పేజి లో చూపిస్తుంది. దీనంతటికీ షాప్ సింక్ యాప్ మీ దగ్గర ఏమీ వసూలు చేయదు. అది అమ్మకందారు దగ్గర తీసుకుంటుంది. ఈ యాప్ నుండి మరొక యాప్ కి వెళ్లి అక్కడ షాపింగ్ చేయడం అనేది కొంచెం విసుగు తెప్పిస్తుంది కాబట్టి మీకు కావాల్సిన వివరాలన్నీ విశ్లేషణ లతో సహా ఇదే అందిస్తుంది.

అమజాన్ లాంటి సైట్ ల లో కూడా కస్టమర్ రివ్యూ లు ఉంటాయి కదా, మరి వాటిని చూసి కొనవచ్చు కదా? ఇలాంటి యాప్ ల అవసరం ఏముంది ? ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు ఉండవచ్చు. కానీ నిశితంగా గమనిస్తే ఈ సైట్ లలో ఉండే కస్టమర్ రివ్యూ లు అంత స్పష్టం గా ఉండవు. అదే ఈ యాప్ లో నైతే నిపుణుల విశ్లేషణ ల తో పాటు మీ స్నేహితుల అభిప్రాయాలు కూడా తీసుకునే వీలు ఉంటుంది. ఇన్ని సలహాల మధ్య ఖచ్చితంగా మనకు మంచి ప్రోడక్ట్ లభించే అవకాశం ఉంది.

ఈ యాప్ ఎలా పనిచేస్తుంది?

మీరు ఈ యాప్ ను లాంచ్ చేసినపుడు స్క్రీన్ పై ఒకేసారి అనేక ప్రోడక్ట్ లతో కూడిన ఒక లే అవుట్ మీకు కనిపిస్తుంది. అక్కడనుండి మీకు కావాల్సిన దానిని మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. క్యాటగరీ లు మాత్రం మీకు వెంటనే కనిపించవు. దానిలో ఉండే వివిధ మెనూ లను ఎంపిక చేసుకోవడం ద్వారా మీకు కావాల్సిన దానిలోనికి మీరు వెళ్ళవచ్చు. అంటే ముందుగా మీకు ప్రొడక్ట్స్ యొక్క వివరాలు కనిపిస్తాయి అన్నమాట. మీకు కావాల్సిన ప్రోడక్ట్ పై టాప్ చేసినపుడు అది స్నాప్ డీల్ లో ఎలా లభిస్తుంది, అమజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లలో ఎలా లభిస్తుందో చూపిస్తుంది. సంబందిత సేల్ లూ, సీజనల్ డీల్ లను కూడా ఇది చూపిస్తుంది. ఇలా ట్యాప్ చేయడం వలన ఎక్కడ ఎక్కువ ధరకు లభిస్తుందీ ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందీ యిట్టె తెలిసి పోతుంది. ఈ ధరలలో వ్యత్యాసం తెల్సుకోవడం అనేది చాలా యాప్ లు మరికొని సైట్ లు కూడా ఇస్తున్నాయి, కానీ వాటికి భిన్నంగా ఈ యాప్ ను నిలబెడుతున్నది మాత్రం చాటింగ్ సౌకర్యం.  అదే conversation feature.

ప్రతీ ప్రోడక్ట్ పక్కనే ఒక చాట్ బటన్ ఉంటుంది. ఆ చాట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా అప్పటికే మీరు ఎవరితోనైనా చాటింగ్ లో ఉంటె దాని లోనికి వెళ్లిపోవచ్చు లేదా కొత్త చాట్ ను మొదలు పెట్టవచ్చు. ఈ చాట్ లో మీరు కోరుకున్న ప్రోడుక్ట్ర్ యొక ఇమేజ్ ను ఉంచి ఆ చాట్ ద్వారా మీ స్నేహితుల అభిప్రాయం అడగవచ్చు. ఒకేసారి ఎన్ని చాట్ లలో నైనా మనం సంభాషించవచ్చు. ఒకే చాట్ లో వివిధ వస్తువుల గురించి అయినా సంభాషించవచ్చు. అంటే మనకు ఒక ఫోన్ నచ్చింది అనుకుందాం. దాని ఇమేజ్ ను ఎంత మంది కైనా పంపి వారి సలహాలు తీసుకోవచ్చు, మరొక పక్క మనకు ఫోన్ , టాబ్లెట్, లాప్ టాప్ ఇలా కొన్ని వస్తువులు నచ్చాయి అనుకుందాం. వాటన్నింటినీ ఒకే సారి చాట్ లో ఉంచి మన స్నేహితుల అభిప్రాయాలు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. ఒకవేళ మీ స్నేహితుని మొబైల్ లో ఈ షాప్ సింక్ యాప్ లేకపోతే మరి చాటింగ్ సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఒకవేళ మీ స్నేహితుని దగ్గర షాప్ సింక్ యాప్ లేకపోతే ఈ లింకు ను వాట్స్ అప్, ట్విట్టర్, ఈమెయిలు,పేస్ బుక్ లేకపోతే కనీసం SMS  ద్వారా అయినా  పంపించవచ్చు.

మీరు వాట్స్ అప్ లేదా మెసెంజర్ లాంటి ద్వారా చాట్ చేస్తున్నపుడు ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్, ధర, పేరు షాప్ సింక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే లింక్ తో సహా మీ స్నేహితునికి పంపబడతాయి. ఒకవేళ వారు షాప్ సింక్ వాడుతున్నట్లయితే అతనికి ఒక విడ్జెట్ లో ఇవన్నీ కనిపిస్తాయి. మీకు కనిపించే వివిధ రకాల సైట్ లలో ఉండే ధరల వ్యత్యాసాలు అన్నీ అతనికి కూడా కనిపిస్తాయి. మీరు కొనాలని పూర్తిగా నిర్ణయించుకుంటే అక్కడ ఉండే బయ్ బటన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మనం ఆన్ లైన్ లో కేవలం ఎలక్ట్రానిక్స్ మాత్రమే కొనుగోలు చేయము కదా! కాబట్టి ఆన్ లైన్ లో కొనుగోలు చేసే ప్రతీ దానికి వివిధ సైట్ లలో ఉండే ధరల వ్యత్యాసాలు తెలుసుకుని మీ స్నేహితుల అభిప్రాయాలు తెలుసుకుని కొనుగోలు చేయవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా ఇన్ స్టాల్ చేసుకోమని చెప్పండి.

 

జన రంజకమైన వార్తలు