• తాజా వార్తలు

మాల్ లో ఎంటర్ అవ్వగానే ఈ యాప్ ఓపెన్ చెయండి - మీ ఖర్చు లో భారీ తగ్గింపు చూడండి

మాల్ లో ఎంటర్ అవ్వగానే ఈ యాప్ ఓపెన్ చెయండి 

మీ ఖర్చు లో భారీ తగ్గింపు చూడండి 

మీరు ప్రముఖ నగరాలలో కానీ వాటికి దగ్గర లో కానీ నివసిస్తున్నారా? లేదా తరచుగా షాపింగ్ మాల్ లకూ, రెస్టారెంట్లకు , హోటల్ లకూ, మల్టీప్లెక్స్ లకూ వెళ్తుంటారా? అయితే ఈ స్టొరీ మీ కోసమే ఇది చదవండి.

మీకు దగ్గరలో ఉండే హోటల్ లూ, మల్టీప్లెక్స్ లూ, రెస్టారెంట్లు ఇలా ఇంకా మరెన్నో మరియు అవి అందించే సేవలూ వాటి ధరల వివరాలూ అన్ని నిక్షిప్తమైన యాప్ ఒకటి ఉంది. అదే లిటిల్ యాప్. కేవలం సంచారం అందించడమే కాదు ఆ యాప్ లో నుండే మీకు కావలసినవి ఆర్డర్ ఇవ్వవచ్చు. అంటే ఒక రకంగా హోం షాపింగ్ అన్నమాట. దేశ వ్యాప్తంగా 11 నగరాల లోని 30,000 మంది వ్యాపారుల కు సంబందిoచిన వివరాలు ఈ యాప్ లో ఉన్నాయి.

ఈ యాప్ ను ఓపెన్ చేసిన వెంటనే మీకు ఎనిమిది రకాల విభాగాలు కనిపిస్తాయి. అవి

  1. ఫుడ్ అండ్ డ్రింక్స్
  2. స్పా
  3. ఫిట్ నెస్
  4. మూవీస్
  5. మెడికల్
  6. థింగ్స్ టు డు
  7. ఆటో
  8. లోకల్ సర్వీసెస్ మరియు హాలిడేస్

మీకు ఏది కావాలంటే దానిని క్లిక్ చేయవచ్చు. అక్కడ ఉండే నియర్ బై అనే ట్యాబ్ ను క్లిక్ చేస్తే మీ ఏరియా లో ఉండే డీల్ ల యొక్క వివరాలు మీకు కనిపిస్తాయి. సాధారణంగా ఏమి కొనాలి అనే దానిపై మనలో చాల మందికి సరైన స్పష్టత ఉండదు కాబట్టి సరైన డీల్ లను ఎంచుకోవడం లో ఈ యాప్ ద్వారా మనకు మరింత స్పష్టత లభించే అవకాశం ఉంది. అంతేగాక ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసిన వారికి భారీ డిస్కౌంట్ లు కూడా అందుబాటులో ఉంటాయి. తద్వారా మీ ఖర్చును  గణనీయమైన రీతిలో తగ్గించుకోవచ్చు.

మీ డీల్ పై ట్యాప్ చేసినపుడు ఆ రిటైలర్ నుండి మీ ఇంటికి ఉన్న దూరం , డీల్ యొక్క విలువ, అది మీకు చేరే మార్గం తదితర వివరాలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ డీల్ ను కుదుర్చుకోవడం కూడా చాలా సులభం. ఈ యాప్ ను ఓపెన్ చేసి మీకు కావలసినది కొనుక్కోవడమే. కొంతమంది డీల్ కుదుర్చుకున్నపుడే మొత్తం డబ్బు ఆన్ లైన్ లో చెల్లించ మంటారు, కొంతమంది కొంత డీల్ కుదుర్చుకున్నపుడు మిగిలినది క్యాష్ ఆన్ డెలివరీ అనే పద్దతి లో ఉంటారు. ఈ లిటిల్ యాప్ అనేది పేమెంట్ లను పే టిఎం ద్వారా నే అంగీకరిస్తుంది కాబట్టి దీనిని వినియోగించుకోవాలంటే పే టిఎం వాలెట్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి ఏ విధమైన ప్రింట్ అవుట్ లూ అవసరం లేదు. కేవలం ఆ డీల్ ను కొనుగోలు చేసి దాని కోడ్ ను వారితో షేర్ చేసుకుంటే చాలు.

మరెందుకు ఆలస్యం. వెంటనే ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని మీ నగరం లోని మాల్ లలో షాపింగ్ చేయండి.

 

జన రంజకమైన వార్తలు