రీఛార్జ్ చేసుకోవడానికి ఇప్పడు ఆన్‌లైన్‌లో ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దీని కోసం ప్రత్యేకంగా సైట్లే అందుబాటులో ఉన్నాయి. ఇక యాప్‌ల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో మనకు కావాల్సినపుడల్లా సులభంగా రీఛార్జ్ చేయడానికి మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు పేజో రీఛార్డ్ బోట్! ఫైన్ టెక్ అనే ఒక అంకుర సంస్థ ఈ సాంకేతికతను రూపొందించింది. అయితే అన్నిటిలా కాకుండా ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండడమే ఈ పేజో బోట్ ప్రత్యేకత. ఈ పేజో బోట్ మార్కెట్లోకి వచ్చి 48 గంటలు గడవక ముందే 2000 వేల మంది వినియోగదారులు ఐతే ప్రత్యేకించి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్‌బుక్‌లో రీఛార్జ్ బోట్ అని సెర్చ్ చేస్తే ఇది సులభఃగా దొరుకుతుంది. కొన్ని రోజులో్ల ఈ యాప్‌తో మిగిలిన మెసేజింగ్ యాప్‌లను అనుసంధానించాలని ఈ సంస్థ భావిస్తోంది. వీటిలో వాట్సప్, ఏపీఐ కూడా ఉన్నాయి. ప్రస్తుతం పేజో బోల్ట్.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, డొకొమోలతో ఒప్పందం చేసుకుంది. చాలా మంది వినియోగదారులు ఒక నెలలో ఎక్కువసార్లు రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఒకసారి రిజిస్ర్టేషన్ పూర్తయ్యాక నిమిషాల వ్యవధిలో బోట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. పేజో బోట్ తమ పేమెంట్ గేట్‌వే గా పేయూతో ఒప్పందం చేసుకుంది. నాలుగు డిజిట్‌ల నెంబర్‌ను ఎంటర్ చేస్తేనే ఈ పేమెంట్ ప్రోసెస్ పూర్తి అవుతుంది. త్వరలోనే 14 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా ఈ బోట్ రాబోతోంది. 400 మిలియన్ల స్మార్టుఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రణాళిక సిద్ధః చేశారు. ప్రస్తుతం తాము ఎన్‌బీఎఫ్‌సీ మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నామని పేజో బోట్ తెలిపింది. |