వినియోగదారులు ఎలాంటి అవసరాలు ఉంటాయో ముందుగానే గుర్తించి భిన్నమైన యాప్‌లను తయారు చేస్తున్నాయి నేటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు. ముఖ్యంగా అలాంటి యాప్‌లు తయారు చేయడంలో గూగుల్‌ది ప్రత్యేక స్థానం. అలాంటి ప్ర్యతేక కోవకు చెందిందే మోషన్ స్టిల్స్ యాప్. ఐఓఎస్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను తయారు చేసింది గూగుల్. ఈ యాప్ స్పెషాలిటీ ఏంటంటే లైవ్ ఫొటోలను జీఐఎఫ్ ఇమేజ్‌లుగా మార్చడం. సాధారణంగా జీఐఎఫ్ ఇమేజ్‌లుగా మార్చాలంటే దానికి ఉండే ప్రొసెస్ వేరు. ఒకవేళ జీఐఎఫ్ ఇమేజ్‌లుగా మార్చినా అన్ని ఫొటోలను అలా కన్వర్ట్ చేయలేం. ముఖ్యంగా లైవ్ ఫొటోలను జీఐఎఫ్ ఇమేజ్‌లుగా మార్చడం చాలా కష్టం. అయితే ఆండ్రాయిడ్‌లకు మాత్రం ఈ ఆప్షన్‌ను గూగుల్ విడుదల చేయలేదు. లైవ్ ఫొటోలను ఎలాంటి షాక్ లేకుండా, సులభంగా షేర్ అయ్యేలా చేయడమే ఈ యాప్ లైవ్ పని. సోషల్ మీడియాలో షేర్ చేయాలంటే జీఐఎఫ్ యాప్‌లు పెద్దవిగా ఉంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి. వాటిని సరైన సైజులో చేయడం, క్లియర్‌గా ఉండేలా చూడటం, డౌన్‌లోడ్‌కు అనుకూలంగా మార్చడం మోషన్ స్టిల్స్ యాప్ ప్రత్యేకత. యూజర్లకు పర్సనలైజ్డ్ జీఐఎఫ్ ఇమేజ్‌లు తయారు చేయడానికి మోషన్ స్టిల్స్ ఎంతో ఉపయోగపడనుంది. జీఐఎఫ్ ఇమేజ్‌లన్నీ ఒక చోటకు చేర్చి మూవీ క్లిప్‌లా తయారు చేయడానికి కూడా ఈ మోషన్ స్టిల్స్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మోషన్ యాప్‌లో స్టెబిలైజేసన్, రెండరింగ్ టెక్నాలజీలను వాడటం వల్ల వీడియోలు మరింత చక్కగా తయారవుతాయి. ప్రస్తుతం ఈ యాప్ ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐ ఫోన్ ఎస్ఇ ఫోన్లలో మాత్రమే లభ్యం అవుతోంది. త్వరలో అన్ని స్మార్ట్‌ఫోన్లలో మోషన్ స్టిల్స్ యాప్ అందుబాటులోకి వస్తుందని గూగుల్ సంస్థ తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ లభ్యం కాకపోయినా స్మార్ట్‌ఫోన్ యూజర్లు లైవ్ మేకర్, డీఎస్‌సీవో, ఫ్యూజ్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. మనం ఫొటోలు తీసుకున్న తర్వాత ఈ యాప్ ఆటోమెటిగ్గా ఆ ఫొటోలను కలెక్ట్ చేసి ఒక జీఐఎఫ్ రూపంలో మనకు చూపిస్తుంది...అయితే అవి మనకు నచ్చితే షేర్ చేసుకోవచ్చు. త్వరలోనే అన్ని స్మార్టుఫోన్లలో ఈ ఆప్షన్ లభ్యం అవుతుంది. గూగుల్ ఫొటోలను కూడా జీఐఎఫ్‌లుగా మార్చేలా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయని గూగుల్ సంస్థ తెలిపింది. |
|