• తాజా వార్తలు

అతి చవకైన హై స్పీడ్ ఇంటర్ నెట్ ప్లాన్స్ అందిస్తున్న బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ఏది? .

అభివృద్ది చెందిన దేశాలైన US, UK, దక్షిణ కొరియా మొదలైన దేశాలతో పోలిస్తే ఇండియా లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్ నెట్ స్పీడ్ లు చాలాతక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడిప్పుడే ఇండియా లోని బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్ లు 100Mbps వరకూ ఇంటర్ నెట్ స్పీడ్ ను అందించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఇవి దేశం లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయి ఉన్నాయి. దేశం లో IT సిటీ గా పేరుగాంచిన బెంగుళూరు మహానగరం లో కూడా ఇంతకుముందు అంత గొప్ప స్పీడ్ ఏమీ ఇంటర్ నెట్ సేర్వ్చీ లలో ఉండేది కాదు.  కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అనేకరకాల బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ లు హై స్పీడ్ ఇంటర్ నెట్ ను అందిస్తున్నాయి. వాటి మధ్య పోటీ కూడా అదే స్థాయి లో ఉంది. ఈ నేపథ్యం లో అక్కడ అటు చవకైన హై స్పీడ్ ఇంటర్ నెట్ ను అందించే బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం. ఇది కేవలం బెంగుళూరు కు మాత్రమే పరిమితం కాదు. వీటిలో కొన్ని ఆపరేటర్ లు ఇప్పటికే దేశం లో అనేక ప్రాంతాలకు తమ సేవలను విస్తరించగా మరికొన్ని అతి త్వరలోనే తమ సేవలను దేశం లోని మారుమూల పట్టణాలకు సైతం విస్తరించనున్నాయి.

ACT ఫైబర్ నెట్

ఇండియా లో అత్యంత నమ్మకమైన ప్రముఖమైన బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ ఏదీ అంటే ముందు వరుసలో ఉండే పేరు ఈ ACT బ్రాడ్ బ్యాండ్. ఇంతకుముందు దీనిని బీమ్ ఇంటర్ నెట్ అని పిలిచేవారు. ప్రస్తుతం ఇది అత్యంత చవకైన ధరలో హై స్పీడ్ ఇంటర్ నెట్ ను అందిస్తుంది. 100 Mbps వరకూ స్పీడ్ ను రూ 1999/- లలో అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ 150 GB FUP లిమిట్ లో లభిస్తుంది. అంటే అప్ లోడ్ లు కానీ డౌన్ లోడ్ లు కానీ ఈ లిమిట్ దాటిచేయకూడదు. ఒకవేళ దాటితే ఈ ప్లాన్ వర్తించదు. లిమిట్ దాటిన తర్వాత ఇది 1 Mbps స్పీడ్ ను అందిస్తుంది.

స్పెక్ట్ర నెట్

ACT ఫైబర్ నెట్ కు ఇది అసలైన పోటీదారుగా నిలిచింది. ప్రస్తుతం ఇది బెంగుళూరు నగరం లో 100Mbps వరకూ స్పీడ్ ను రూ 1849/- లో అందిస్తుంది. ఈ ప్లాన్ లో గొప్ప విషయం ఏమిటంటే దీనికి డేటా లిమిట్ ఏదీ లేదు. అనేకమంది వినియోగదారుల రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం సిటీ లో అత్యుత్తమ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ఈ స్పెక్త్రా నెట్.

BBNL

ఇది ఒక లోకల్ ఆపరేటర్. ఇది తన పోటీదారులకు పోటీగా అత్యుత్తమ ప్లాన్ లను అందిస్తుంది.100 Mbps ప్లాన్ ను ఇది రూ 2300/- లకు అందిస్తుంది. దీనికి ఉండే ప్రతికూలత ఏమిటంటే ఇది కేవలం 75GB FUP లిమిట్ లో లభిస్తుంది.

ఎయిర్ టెల్ V ఫైబర్ బెంగుళూరు

ప్రముఖ టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్ టెల్ తన V- ఫైబర్ సేవలను ఈ మధ్యనే బెంగుళూరు లో ప్రారంభించింది.ఇది 100Mbps వరకూ హై స్పీడ్ డేటా ను అందిస్తుంది. అయితే ప్రస్తుతం బెంగుళూరు లో ఇది 40 Mbps స్పీడ్ ను రూ 2099/- లో అందిస్తుంది. దీనిలో ఉండే సానుకూలత ఏమిటంటే దీని FUP లిమిట్ 220 GB గా ఉన్నది.

G బ్రాడ్ బ్యాండ్

ఈ జి బ్రాడ్ బ్యాండ్ అనేది బెంగుళూరు లోని మరొక లోకల్ ఇంటర్న్ ఎత సర్వీస్ ప్రొవైడర్. ఇది కూడా అందుబాటు ధరలలో హై స్పీడ్ డేటా ప్లాన్ లను అందిస్తుంది. 400 GB FUP లిమిట్ తో కూడిన 100 Mbps ప్లాన్ ను ఇది రూ 3399/- లకు అందిస్తుంది. ఇందులో మరొక ముఖ్య విషయం ఏమిటంటే FUP లిమిట్ దాటిన తర్వాత కూడా ఇది 8 Mbps స్పీడ్ ను అందిస్తుంది.

 

జన రంజకమైన వార్తలు