• తాజా వార్తలు

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 625 Soc ప్రత్యేకత ఏమిటి?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ల యుగం నడుస్తుంది. నేడు మార్కెట్ లో అనేక రకాల స్మార్ట్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కంపెనీ నే పదుల సంఖ్య లో మోడల్ లను కలిగిఉంది అని అంటే నేడు ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయో ఊహించవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా పర్ ఫెక్ట్ గా ఉండదు. ఒక్కో ఫోన్ కెమెరా అద్భుతంగా ఉంటే బాటరీ పనితీరు సరిగా ఉండదు. బాటరీ అద్భుతంగా కెమెరా క్వాలిటీ ఉండదు. ఇలా ఒక ఫీచర్ బాగుంటే మరొక ఫీచర్ సరిగా ఉండదు. గత సంవత్సరం అనేక రకాల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోనికి లాంచ్ అవడం మనం చూశాం. జియోనీ, ఆసుస్, జియోమీ, లాంటి ఫోన్ లు అత్యుత్తమ పనితీరు తో కూడిన బాటరీ ని అందించడం మనం చూశాము.

అత్యుత్తమ బాటరీ కలిగిన ఫోన్ ను అందించాలనే ఫార్ములా ను మొట్టమొదటగా జియోనీ ప్రారంభించింది.  ఆ తర్వాత నిదానంగా అన్ని కంపెనీలు అదే బాట పట్టాయి. దాని తర్వాత సంవత్సరాంతంనకు వచ్చేసరికి కంపెనీ ల దృష్టి బాటరీ నుండి కెమెరా మీదకు మళ్ళింది.

కానీ చిప్ తయారీదారులు అయిన క్వాల్ కాం యొక్క ప్రణాళికలు వేరొక రకంగా ఉన్నాయి. 2016 ప్రారంభం లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 625 చిప్ సెట్ ను ప్రకటించింది. ఇది దీనిముందు వెర్షన్ ల బాటరీ పనితీరుకంటే 40 శాతం అదనంగా పనిచేస్తుంది. ఇది సరదాగా చెప్పింది కాదు. ఆసుస్ జెన్ ఫోన్ 3 మరియు మోటోరోలా మోటో Z ప్లే ఫోన్ లు లాంచ్ అయిన తర్వాత క్వాల్ కాం యొక్క మాటలు నిజమని నిరూపితమయింది. ఈ రెండు ఫోన్ లు కూడా రెండు మూడు నెలల క్రితం ఇండియన్ మార్కెట్ లోనికి ప్రవేశించాయి.  అంతేగాక బాటరీ యొక్క పనితీరు విషయం లో వినియోగదారుల ఆదరణ తో పాటి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. అనేకరకాల టెక్ బ్లాగ్స్ మోటో Z ప్లే ను అత్యుత్తమ బాటరీ ని అందించే ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఉత్తమ ఫోన్ గా రేట్ చేశారు. ఇది కేవలం 3510 mAh బాటరీ అయినప్పటికీ ఇందులో ఉన్న చిప్ సెట్ వలన అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.

ఇక్కడ స్పష్టమైన విషయం ఏమిటంటే స్నాప్ డ్రాగన్ 625 చిప్ సెట్ అనేది బ్యాటరీ లైఫ్ ను అద్భుతంగా పెంచుతుంది అన్నమాట. ఈ సంవత్సరం ఫెస్టివల్ సీజన్ ల నుండీ స్నాప్ డ్రాగన్ 625 Soc తో పవర్ చేయబడిన అనేకరకాల ఫోన్ లు రానున్నాయి. వాటిలో అత్యుత్తమ మైన వాటిని ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం చూడండి.

Xiaomi  రెడ్ మీ నోట్ 4

చైనా కు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఇది గత సంవత్సరం ఇండియన్ మార్కెట్ లో మంచి లాభాలనే చూసింది.దీని ఉత్పాదన అయిన రెడ్ మీ నోట్ 3 వలన ఇది సాధ్యమైంది. అది బెస్ట్ బడ్జెట్ ఫోన్ గా కితాబు అందుకుంది. దీని స్ఫూర్తితో ఈ సంవత్సరం జియోమీ రెడ్ మీ నోట్ 4 ను విడుదల చేయనుంది.ఇది ఇప్పటికే చైనా లో లాంచ్ అయింది, కానీ అక్కడ లాంచ్ అయిన ఫోన్ లో ఉన్నది మీడియా టెక్ చిప్ సెట్.అదే ఇండియా కి వచ్చేసరికి ఈ చిప్ సెట్ కు అనుమతి లేదు. కాబట్టి ఇండియా లో లాంచ్ చేయబోయే రెడ్ మీ నోట్ 4 ఫోన్ లలో స్నాప్ డ్రాగన్ 625 చిప్ సెట్ ను ఉపయోగించనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి చివరి కల్లా ఈ ఫోన్ భారత మార్కెట్ లో నికి ప్రవేశించనుంది.ఇది 2 GB/ 3 GB/ 4 GB RAM లతో కూడిన వేరియంట్ లలో లభించనుంది. Mi explorers పేరుతొ ఈ సంవత్సరం ఒక కార్యక్రమం కూడా ప్రారంభించే యోచనలో జియోమీ ఉంది.

లెనోవా P 2

లెనోవా యొక్క వైబ్ P 1 యొక్క తర్వాతి వెర్షన్ గా వైబ్ P2 ను గత సంవత్సరం లాంచ్ చేసింది. కాకపోతే అది లాంచ్ చేసి వారం రోజులే అవుతుంది. అంటే డిసెంబర్ చివరిలో అన్నమాట. ఇండియా కు అతి త్వరలో దీనిని తీసుకురానున్నట్లు లెనోవ తన అధికారిక ట్విట్టర్ పేజి లో ప్రకటించింది. ఈ లెనోవా P2 ఫోన్ స్నాప్ డ్రాగన్ 625 చిప్ సెట్తో పాటు 4 GB RAM ను కలిగి ఉంటుంది. పండగ సీజన్ లోపు ఇది ఇండియన్ మార్కెట్ లోనికి వచ్చే అవకాశం ఉంది. ఈ చిప్ సెట్ తో పాటు 5100 mAh బాటరీ ని ఇది కలిగి ఉంటుంది.

ఆసుస్ జెన్ ఫోన్ 3 జూమ్

రెండు రోజుల క్రితం CES2017 వేదికగా ఈ ఆసుస్ జెన్ ఫోన్ విడుదల చేయబడింది. ఇది ఇండియా లో లాంచ్ అయ్యేసరికి కొంచెం సమయం పట్టవచ్చు. అదికూడా అతి త్వరలోనే. గత సంవత్సరం ఆసుస్ తన జెన్ ఫోన్ జూమ్ ను ఇండియా లో జనవరి 22 న లాంచ్ చేసింది. కాబట్టి జెన్ ఫోన్ 3 జూమ్ విషయం లో కూడా అలాగే ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ఇక ఫోన్ విషయానికొస్తే ఇది స్నాప్ డ్రాగన్ 625 Soc తో పవర్ చేయబడి 4 GB RAM మరియు 5000 mAh ల పెద్ద బాటరీ తో లభిస్తుంది.

Huawei Nova/ నోవా ప్లస్

Huawei తన హానర్ 6 x అనే స్మార్ట్ ఫోన్ ను జనవరి 24 న లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా అదే రోజు మరొక అంశం కూడా జరిగే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనా కు చెందిన ఈ కంపెనీ అదే రోజు ఈ ఫోన్ తో పాటు నోవా మరియు నోవా ప్లస్ ఫోన్ లను కూడా లాంచ్ చేయనుందని సమాచారం. ఈ రెండు ఫోన్ లు కూడా స్నాప్ డ్రాగన్ 625 Soc తో పవర్ చేయబడి 3 GB RAM ను కలిగిఉంటాయి.

జన రంజకమైన వార్తలు