• తాజా వార్తలు

క్విక్ ఛార్జ్ vs డాష్ ఛార్జ్ వీటిలో ఏది ఉత్తమం?

రోజుల్లో లభిస్తున్న స్మార్ట్ ఫోన్ లలో దాదాపు అన్ని ఫోన్ లూ చాలా తక్కువ బాటరీ లైఫ్ ను అందిస్తున్నాయి అనే విషయం అందరూ ఒప్పుకోవల్సిందే.టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫోన్ ల యొక్క విస్తృతి గణనీయంగా పెరిగినప్పటికీ ఈ విషయం లో మాత్రం మెరుగుపరచలేకపోతున్నాయి. ఎన్నెన్నో కొత్త ఫీచర్ లు ఈ స్మార్ట్ ఫోన్ లలో వస్తున్నప్పటికీ బాటరీ లైఫ్ మాత్రం అలాగే ఉంటుంది.

ఈ మధ్య కాలంలో కొంతమంది స్మార్ట్ ఫోన్ అమ్మకందారులు ఈ బాటరీ లైఫ్ పై దృష్టి పెట్టినప్పటికీ వినియోగదారులను సంతృప్తి పరిచే స్థాయిలో మాత్రం వారి ప్రయత్నాలు ఫలించలేదు. దారుణమైన విషయం ఏమిటంటే ఈ స్మార్ట్ ఫోన్ లను మరింత స్లిమ్ గా మార్చే క్రమం లో ఫోన్ యొక్క బాటరీ విషయం లో రాజీ పడుతున్నారు. రూ 50,000/- ల ఖరీదు చేసే ఫోన్ కూడా రోజులో రెండవసారి ఛార్జింగ్ పెట్టకుండా వాడలేని పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకు చక్కగా ఉండే హ్యాండ్ సెట్ లూ కావాలి దానితో పాటే మంచి బాటరీ లైఫ్ కూడా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇది దాదాపు అసాధ్యం గా కనిపిస్తుంది.

అంటే ఈ సమస్యకు ఇక పరిష్కారం లేదా?

ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉన్నట్లే దీనికి కూడా ఒకటి ఉంది. కానీ ఇదేమంత ఖచ్చితమైన సొల్యూషన్ కాదు. కానీ ఈ బాటరీ సమస్యను కొంతవరకూ పరిష్కరించగలుగుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అంశం ఫాస్ట్ ఛార్జింగ్ గురించి. అవును మీ స్మార్ట్ ఫోన్ బాటరీ ని వేగంగా ఛార్జ్ చేయడం ద్వారా ఇది ఛార్జింగ్ పవర్ ను పెంచుతుంది. 30 నిమిషాలలో 50% ఛార్జింగ్ ను ఇది అందిస్తుంది. ఇది ఒక్కో కంపెనీ కి ఒక్కో రకంగా ఉంటుంది. ప్రస్తుతం అనేక రకాల కంపెనీ లు ఈ తరహా టెక్నాలజీ ని అందిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఏమిటంటే క్వాల్ కాం యొక్క క్విక్ ఛార్జ్, ఒప్పో యొక్క VOOC ఫ్లాష్ ఛార్జ్ మరియు వన్ ప్లస్ యొక్క డాష్ ఛార్జ్ టెక్నాలజీ.డాష్ ఛార్జ్ అనేది ఫ్లాష్ ఛార్జ్ యొక్క అప్ డేటెడ్ వెర్షన్ కాబట్టి ప్రస్తుతానికి క్విక్ ఛార్జ్ మరియు డాష్ ఛార్జ్ ల మధ్యే పోటీ ఉంది. మరి ఈ రెండింటిలో ఏది ఉత్తమం? డాష్ ఛార్జ్ వైపే కొంచెం మొగ్గు కనిపిస్తున్నప్పటికీ ఈ రెండింటి పనితీరును ఈ ఆర్టికల్ లో విశ్లేషిద్దాం.

మొదటగా క్విక్ ఛార్జ్ తో పోల్చిచూస్తే డాష్ ఛార్జ్  కొంచెం సురక్షితంగా ఉంటుంది. అంటే క్విక్ ఛార్జ్ ప్రమాదకరం అని అర్థం కాదు. దీనికి కారణమేమిటంటే క్వాలం కాం యొక్క క్విక్ ఛార్జింగ్ ప్రక్రియ లో ఛార్జింగ్ కంట్రోల్ కు ఫోన్ లోపల ఒక ప్రత్యెక సర్క్యూట్ ఉంటుంది. అదే డాష్ ఛార్జ్ లో అయితే ఈ కంట్రోలింగ్ సర్క్యూట్ అనేది వాల్ చార్జర్ లోనే ఉంటుంది. అంటే బాటరీ తొందరగా వేడి అయ్యే అవకాశాలు క్విక్ ఛార్జ్ తో పోలిస్తే తక్కువగా ఉంటాయి.

రెండవదిగా క్విక్ ఛార్జ్ కంటే డాష్ ఛార్జ్ ఎక్కువ వేగంగా ఉంటుంది. 100 శాతం ఛార్జింగ్ కు క్విక్ ఛార్జ్ కు 70 నిముషాలు తీసుకుంటే డాష్ ఛార్జ్ ఒక గంటలోనే పూర్తీ చేస్తుంది. డాష్ ఛార్జ్ ను ఉపయోగించాలి అంటే ప్రత్యేకమైన కేబుల్ మరియు చార్జర్ ను ఉపయోగించాలి అందే డాష్ ఛార్జ్ కి అయితే సర్టిఫైడ్ కేబుల్ ఏదైనా సరిపోతుంది.

జన రంజకమైన వార్తలు