మహిళా రక్షణ కు ప్రాధాన్యం ఇస్తున్నహ్యాండ్ సెట్ తయారీ దారులు వచ్చే సంవత్సరం జనవరి నుండీ తయారయ్యే అన్ని మొబైల్ హ్యాండ్ సెట్ ల లోనూ పానిక్ బటన్ లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యం లో యాప్ తయారీ దారులు అందరూ ఆ దిశగా తమ ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే యాప్ తయారీదారులు అందరూ వారి ఉత్పదనలను మహిళా రక్షణ తో సమీకృతం చేస్తూ డిజైన్ చేసే విధంగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికే మహిళా రక్షణ కు సంబంధించి కొన్ని యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలా వరకూ ప్రముఖమైనవి కూడా . విత్ యు, వుమన్ సేఫ్టీ షీల్డ్, ఐ ఫీల్ సేఫ్,నిర్భయ, బి ఫియర్ లెస్ , ఐ యామ్ శక్తి అండ్ సెక్యూర్ హర్ ఇలాంటి కొన్ని ప్రముఖ యాప్ లన్నీ ఆ కోవలోనివే. ఇవి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ లలో పనిచేస్తాయి. ఈ యాప్ లు చాలా తక్కువ ధరలోనూ లేదా ఉచితం గానూ హ్యాండ్ సెట్ వ్యాపారులకు లభిస్తాయి.అంతేగాక ఆ హ్యాండ్ సెట్ లలో ఉన్న హార్డ్ వేర్ లకు ఫిట్ అయ్యే విధంగా ఉంటాయి. కార్బన్ లాంటి కొన్ని హ్యాండ్ సెట్ తయారీ వ్యాపారులు మహిళా రక్షణ కోసం తమ సొంత యాప్ లను తయారు చేసుకుంటున్నారు. కొరియా కు చెందిన హ్యాండ్ సెట్ సంస్థ అయిన LG అయితే పానిక్ బటన్ తో ఇప్పటికే ఒక సంర్ట్ ఫోన్ ను అందుబాటులోనికి తెచ్చింది. క్రితం ఆర్టికల్ లో దాని గురించి చర్చించాము. మొబైల్ పరికరాలకు IMEIనెంబర్ లను అందించే MSAI బిజినెస్ హెడ్ అయిన భావనా కుమారి మాట్లాడుతూ “ కొంత మంది ఇప్పటికే పానిక్ బటన్ ల ద్వారానూ మరికొంత మంది ఐ ఫీల్ సేఫ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారానూ మహిళా రక్షణ కు ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది.” అని అన్నారు. అయితే వారి పేర్లను ప్రకటించడానికి మాత్రo నిరాకరించారు. ఈ ఐ ఫీల్ సేఫ్ అనే యాప్ ఇండియా లో త్వరలో లాంచ్ అవ్వబోయే 2 జి, 3 జి, మరియు 4 జి టెక్నాలజీ లలో కూడా అందుబాటులోనికి రానుంది. ఈ పరికరాల తయారీ దారులు ఇక నుండీ పానిక్ బటన్ ఉన్న పరికరాలనే తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న దసరా దీపావళి పండుగల సీజన్లో ఈ యాప్ లపై విస్తృత ప్రచారం జరుగబోతోంది. తాము ఇకనుండీ ప్రవేశ పెట్టనున్న హ్యాండ్ సెట్ లలో ఇన్ బిల్ట్ గా పానిక్ బటన్ తో కూడిన ఒక వుమన్ సేఫ్టీ యాప్ ను ఉంచనున్నట్లు కార్బన్ మొబైల్స్ చెబుతుంది. మిగతా వినియోగాదారుల కోసం ఈ యాప్ ను ప్లే స్టోర్ మరియు కార్బన్ యాప్ స్టోర్ లోనూ ఉంచనున్నట్లు కార్బన్ చెబుతుంది. పానిక్ బటన్ స్మార్ట్ ఫోన్ లలో మరిన్ని మార్పులు సృష్టించనుందో చూద్దాం. |