• తాజా వార్తలు

రియ‌ల్ ఎస్టేట్‌కు.. టెక్ హంగు

అపార్ట్ మెంట్ కొనాలంటే రియ‌ల్ ఎస్టేట్ సంస్థ ను సంప్ర‌దించ‌డం, వాళ్లి చ్చే బ్రోచ‌ర్లు, సైట్ మ్యాప్‌, వెంచ‌ర్ డిజైన్ చూసి ఓ అంచ‌నాకు రావ‌డం.. ఇదీ సాధార‌ణంగా అంద‌రూ చేసేది. కానీ చాలా రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు బ్రోచ‌ర్ల మీదే అద్భుతాలు చూపిస్తుంటాయి. తీరా ఫ్లాట్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ పూర్త‌య్యాక స‌రైన వెంటిలేష‌న్ లేక‌పోవ‌డం, వాస్తు స‌మ‌స్య‌లు, డిజైన్‌లో లోపాలు క‌నిపిస్తుంటాయి. ఇలాంటి ప్రాబ్ల‌మ్స్ ఏమీ లేకుండా ప్రాప‌ర్టీని కొనాల‌నుకునేవారికి దాని పూర్తి పిక్చ‌ర్‌ను చూపించ‌డానికి టెక్నాల‌జీని వినియోగించుకుంటోంది ప్రోప‌ర్టీ పోర్ట‌ల్ మాజిక్ బ్రిక్స్‌. కామ్. టెక్నాల‌జీలో లేటెస్ట్ ట్రెండ్స్ అయిన వీఆర్ (వ‌ర్చువ‌ల్ రియాలిటీ), ఏఆర్ ( ఆగ్మెంటెడ్ రియాలిటీ)ల‌ను ఉప‌యోగించి ప్రాప‌ర్టీని క‌స్ట‌మ‌ర్‌కు చూపిస్తున్నారు.

ఇండియాలో కొత్త‌గా ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనాల‌నుకునేవారు త‌మ‌కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో నాలుగైదు వెంచ‌ర్స్‌ను చూస్తారు. వాటిలో త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌ది సెలెక్ట్ చేసుకుంటారు. అయితే అప్ప‌టికి సైట్ డెవ‌ల‌ప్ చేస్తూనో.. లేదా బేస్‌మెంట్‌, పిల్ల‌ర్ లెవెల్లోనో ఉంటుంది. దీంతో బిల్డ‌ర్ చూపించే 2 డైమ‌న్ష‌న‌ల్ మ్యాప్ ఆధారంగా క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఇలా ఉండొచ్చ‌నే అంచ‌నాతో కొంటున్నారు. క‌న్‌స్ట్ర‌క్ష‌న్ పూర్త‌య్యాక క‌స్ట‌మ‌ర్ ఆశించిన స్థాయిలో ప్రాప‌ర్టీ ఉండ‌డం లేదు. తాము స‌ర్వే చేసిన వాట‌లో దాదాపు 60 % అపార్ట్‌మెంట్ల‌లో స‌రైన వెంటిలేష‌న్ లేదా స‌హ‌జ‌మైన లైటింగ్ లేద‌ని మేజిక్ బ్రిక్స్‌. కామ్ సీఈవో సుధీర్‌పాయ్ చెప్పారు. క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కొంత పూర్త‌య్యాక కొంటే ఎలా ఉంటుందో అవ‌గాహ‌న వ‌స్తుంది. కానీ వెంచ‌ర్ స్టార్టింగ్ తో కంపేర్ చేస్తే ఈ ద‌శ‌లో ప్రాప‌ర్టీ రేట్ క‌నీసం మూడు, నాలుగు ల‌క్ష‌లు పెరిగిపోతుంది.

ఎక్స్ పీరియ‌న్స్ సెంట‌ర్

ప్రాప‌ర్టీ కొనాల‌నుకునేవారికి ఇలాంటి స‌మ‌స్య లేకుండా టెక్నాల‌జీని వాడుకుంటోంది మాజిక్ బ్రిక్స్‌.కామ్‌. క‌స్ట‌మ‌ర్‌కు పూర్తి స్థాయిలో త‌మ ప్రాప‌ర్టీ ఎలా ఉందో చూపించ‌డానికి ఈ సంస్థ చాలా క‌స‌ర‌త్తే చేసింది. ప్రాజెక్టు ఇన్ఫ‌ర్మేష‌న్‌, మ్యాప్‌లు, వెంచ‌ర్ డిజైన్ల‌ను ఫొటోలు, వీడియోల రూపంలో త‌యారు చేస్తోంది. వీటిని వీఆర్ లేదా ఏఆర్ టెక్నాల‌జీతో క‌లిపి క‌స్ట‌మ‌ర్‌కు చూపిస్తుంది. ఇందుకోసం ముంబ‌యిలోవెస్ట్ర‌న్ ఎక్స్‌ప్రెస్ హైవే మెట్రో స్టేష‌న్‌లో ఓ రియ‌ల్ ఎస్టేట్ ఎక్స్‌పీరియన్స్ సెంట‌ర్‌నే ర‌న్ చేస్తోంది.

* పెద్ద పెద్ద ట‌చ్ స్ర్రీన్ల‌తో అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోస్‌, వీడియోలు సిద్ధంగా ఉంటాయి. ప్లాన్ ఎలా ఉంది.. క‌న్‌స్ట్ర‌క్ష‌న్ త‌ర్వాత ఎలా ఉండ‌బోతుంద‌నే అంచ‌నాల‌న్నీ ట‌చ్ చేసి తెలుసుకోవ‌చ్చు.

* వినియోగ‌దారుడి సందేహాలు తీర్చేందుకు వీడియో కాల్ ద్వారా ఎక్స్‌ప‌ర్ట్‌లు అందుబాటులో ఉంటారు.

* అపార్ట్‌మెంట్ కాస్ట్‌.. మ‌న పెట్టుబ‌డి.. లోన్ ఎంత వ‌స్తుంది.. ఈఎంఐ ఎంత‌వుతుంది వంటివ‌న్నీ లెక్క‌గ‌ట్టే ఫైనాన్షియ‌ల్ కాలిక్యులేట‌ర్లు ఉంటాయి.

* ఇత‌ర ప్రాప‌ర్టీస్‌తో కంపేరిజ‌న్‌, మ్యాప్‌ల‌ను చూపించే టచ్‌స్ర్ర్ర్కీన్‌లు అందుబాటులో ఉంచుతారు.

వీటన్నింటితో ప్రాప‌ర్టీ ఎలా ఉంటుంద‌నేది 360 డిగ్రీల కోణంలో చూపించ‌గ‌లుగుతాం అంటున్నారు మ్యాజిక్ బిక్స్‌.కామ్ టెక్నాల‌జీ హెడ్ సుబోధ్ కుమార్ చెప్పారు.

ఇక వ‌ర్చువ‌ల్ రియాలిటీ (వీఆర్ ) టెక్నాల‌జీతో అయితే క‌స్ట‌మ‌ర్ అపార్ట్‌మెంట్‌లో క‌లియతిరిగిన అనుభూతిని పొందుతాడు. బాల్క‌నీ ఎలా ఉంది. హాల్ ఎంత స్పేస్ వ‌స్తుంది. బెడ్‌రూం, బాత్‌రూం ఇలా భ‌వ‌నం క‌ట్టాక ఎలా ఉంటుందో ముందే అనుభూతి చెందేలా ఉంటుంది.

ఏగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్‌) టెక్నాల‌జీతో అయితే అపార్ట్‌మెంట్‌ను ఏరియ‌ల్ వ్యూలో చూడొచ్చు. లాండ్‌స్కేపింగ్ ఎలా ఉంది. ఏ రోడ్‌కు అపార్ట్‌మెంట్ ఎంత దూరంలో ఉంది.. వంటివ‌న్నీ ప్ర‌త్యక్షంగా చూసిన అనుభూతి క‌లుగుతుంది.

ఎనిమిదేళ్లుగా క‌స‌ర‌త్తు

ప్రాప‌ర్టీ కొనాల‌నుకునే క‌స్ట‌మ‌ర్‌కు టెక్నాల‌జీ సాయంతో ఇంత చూపించ‌డానికి మ్యాజిక్ బ్రిక్స్ ఎనిమిదేళ్లుగా క‌స‌ర‌త్తు చేస్తోంది. ఫొటోస్‌, వీడియోస్ త‌యారు చేసుకోవ‌డం, టెక్నాల‌జీని ఎక్వ‌యిర్ చేసుకోవ‌డం వంటి వ‌న్నీ చేసింది. క‌స్ట‌మ‌ర్ ఒక్క‌సారి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌కు వ‌స్తే చాలు అక్క‌డి నుంచే ఆ ప్రాప‌ర్టీని నేరుగా చూసిందాని కంటే బాగా అనుభూతి చెందేలా తీర్చిదిద్దారు.త్వ‌ర‌లో ఇలాంటివి మ‌రో ఏడెనిమిది సెంట‌ర్లు పెట్టాల‌ని కంపెనీ యోచిస్తోంది.

క్లిక్క‌యితే పండ‌గే..

రియ‌ల్ ఎస్టేట్ కొనుగోలు వ్య‌వ‌హారాల్లో ద‌శాబ్దాల నాటి పాత విధానాన్ని ప‌క్క‌కునెట్టి లేటెస్ట్ టెక్నాల‌జీతో బెస్ట్ రిజ‌ల్ట్ తీసుకొచ్చేందుకు వినియోగిస్తున్న ఈ విధానం ప్రాప‌ర్టీ కొనాల‌నుకునేవారికి మంచి అడ్వాంటేజే. ఇది బాగా క్లిక్క‌యితే రియ‌ల్ ఎస్టేట్ సెక్టార్లో టెక్నాల‌జీకి మంచి క్రేజ్ వ‌స్తుంది. అది టెక్నాల‌జీ రంగానికి మంచి ఎసెట్‌గా మారుతుందంటున్నారు నిపుణులు.

 

జన రంజకమైన వార్తలు