రిలయన్స్ జియో సిమ్ తో పాటు జియో ఫై అనే ఒక పర్సనల్ వైఫై డివైస్ ను కూడా లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసినదే. జియో సిమ్ తో పాటు అభించే ఆఫర్ లు అన్నీ ఈ డివైస్ తో కూడా మార్చి వరకూ లభిస్తాయి. అయితే ఈ మధ్యనే జియో ఈ జియో ఫై 2 డివైస్ లో కొని మార్పులు చేర్పులు చేసి జియో ఫై 3 ని మార్కెట్ లోనికి వదిలింది. ఇది ప్రస్తుతం రూ 1999/- లకే లభిస్తుంది. ఇది రిలయన్స్ యొక్క అధికారిక వెబ్ సైట్ లోనూ మరియు రిలయన్స్ డిజిటల్ స్టోర్ లలోనూ లభిస్తుంది. ఈ డివైస్ మీ ఫోన్ యొక్క బాటరీ లైఫ్ ను సేవ్ చేస్తుంది. ఈ జియో ఫై ను ఉపయోగించి జియో 4 జి వాయిస్ యాప్ ద్వారా 2 జి మరియు 3 జి లలో కూడా వాయిస్ కాల్ లు చేసుకోవచ్చు. ఈ నేపథ్యం లో ఇంతకుముందు ఉన్న జియో ఫై 2 కూ మరియు ప్రస్తుతం ఉన్న జియో ఫై 3 కు మధ్య ఉన్న పోలికలను మరియు తేడాలను ఈ ఆర్టికల్ లో పరిశీలిద్దాం.
బాక్స్ యొక్క డిజైన్ :- ఈ రెండిటి మధ్య మనం గుర్తించే మొదటి విషయం జియో ఫై 3 సర్క్యులర్ బాక్స్ డిజైన్ లో లభిస్తుంది. అదే ఇంతకుముందు వెర్షన్ అయిన జియో ఫై 2 దీర్ఘ చతురస్రాకార డిజైన్ లో లభించేది.
రూపం:- ఈ రెండు డివైస్ లూ రూపు విషయం లో తేడా గా ఉంటాయి. జియో ఫై 2 ఒక కోడి గుడ్డు ఆకారం లో ఉండే ప్రకాశవంతంగా ఉంటూ మెత్తటి ప్లాస్టిక్ తో లభించగా జియో ఫై 3 మాత్రం చతురస్రాకారం లో ఉంటూ అంత ప్రకాశవంతంగా కనిపించదు.
సరికొత్త ఒఎల్ యిడి డిస్ప్లే:- జియో ఫై 3 లో ఉన్న ముఖ్యమైన హై లెట్ లలో దీని సరికొత్త ఒఎల్ యి డిడిస్ప్లే ఒకటి. ఇది ఐకాన్ ల బదులుగా ముందు వైపు ఫై భాగాన ఉంటుంది. ఇది బ్యాటరీ లైఫ్, సిగ్నల్ స్ట్రెంత్, వై ఫై స్టేటస్ ను చూపిస్తుంది. అయితే జియో ఫై 2 లో ఉన్న మాదిరిగా ప్రత్యేక WPS మరియు డేటా కనెక్టివిటీ ఇండికేటర్ ఇందులో ఉండదు.
బటన్ ప్లేస్ మెంట్ లు మరియు డైమెన్షన్ లు :- ఈ రెండింటిలో ఉండే మరొక చిన్న తేడా బటన్ ల ప్లేస్ మెంట్. డైమెన్షన్ ల విషయానికొస్తే జియో ఫై 3 96.6x65.2x15.2 mm లలో ఉంటే జియో ఫై 2 మాత్రం కొంచెం తక్కువగా 85x55x16 mm లలో లభిస్తుంది.
బ్యాటరీ:- మరొక ముఖ్యమైన అప్ గ్రేడ్ బ్యాటరీ. జియో ఫై యొక్క బ్యాటరీ సామర్థ్యం 2300mAh ఉండగా జియో ఫై 3 యొక్క బ్యాటరీ 2600mAh ఉంటుంది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ డివైస్ 5 గంటల యూసేజ్ మరియు 260 గంటల స్టాండ్ బై ను ఇస్తుంది. బ్యాటరీ కెపాసిటీ లో పెరుగుదల ౩౦౦ mAh ఉన్నప్పటికీ రెండు డివైస్ లకూ ఛార్జింగ్ అయ్యే సమయం ఒకేరకంగా ఉంటుంది.
సిమ్ మరియ మైక్రో ఎస్ డి స్లాట్ లు :- రెండు వెర్షన్ లలోనూ సిమ్ వేయడానికి బ్యాటరీ ని తీయవలసి ఉంటుంది. కాకపోతే జియో ఫై 3 లో నానో సిమ్ స్లాట్ ఉంటుంది. సిమ్ మరియు మైక్రో ఎస్ డి స్లాట్ లు రెండు స్ప్రింగ్ టైపు మెథడ్ లో ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ లు మారకుండా ఉంటాయి. అదే జియో ఫై 2 లో యితే ఫుల్ సైజ్ సిమ్ స్లాట్ ఉండేది.
కనెక్టివిటీ :- ఇక కనెక్టివిటీ విషయానికొస్తే రెండు పరికరాలు వైఫై 802.11 b/g/n ను సపోర్ట్ చేస్తాయి. అంతేగాక ఒకేసారి 31 వైఫై పరికరాలను కనెక్ట్ చేయగలిగి ఉంటాయి. USB టేధరింగ్ మరియు వైఫై ల యొక్క స్పీడ్ రెండింటిలోనూ ఒకే రకంగా ఉంటుంది.