• తాజా వార్తలు

రిలయెన్స్ జియో టార్గెట్ 8 కోట్ల 4జి కస్టమర్లు

ప్పుడు టెలికాం రంగంలో ఎక్కడ చూసినా ఒకటే మాట అదే 4 జి.అవును స్మార్ట్ ఫోన్ వినియోగ దరులందరూ ఇప్పుడు 4 జి మంత్రం జపిస్తుండడంతో టెలికాం కంపెనీలు కూడా 4 జి బట పట్టాయి.భారత్ లోని టాప్ 3 టెలికాం ఆపరేటర్ లు అయిన భారతి ఎయిర్ టెల్,వోడాఫోన్ ఇండియా,ఐడియా సెల్యూలర్ లు ఇప్పటికే 4 జి రంగం లో ప్రవేశించిన నేపథ్యం లో తాజాగా రిలయన్స్ జియో కూడా ఆ జాబితాలో చేరింది.అంతేకాదు రానున్న రెండేళ్లలో తనయొక్క 4 జి వినియోగదారుల సంఖ్యను 8 కోట్లకు పెంచేలా ప్రణాళికలు రచిస్తుంది.

4 జి యొక్క బూమ్ రానున్న రెండు సంవత్సరాలలో 80,300 కోట్ల  ఆదాయాన్ని సంపాదించ బోతున్నట్లు ఒక అంచనా.  కొత్త గా మార్కెట్ లో ప్రవేసించేవారు ఎవరైనా 8 త్రైమాసికాలలో అంటే రెండు సంవత్సరాలలో 2 నుండీ 5 శాతం వృద్ది రేటు సాధించడం అంటేనే అది చాలా ఎక్కువ. అలాంటిది రిలయన్స్ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే 7 శాతం వృద్ది ని సాధించాలి.ఆయినే సరే దానిని సాధించి తీరుతామని జియో యాజమాన్యం విశ్వాసం తో ఉన్నది.అంతేకాదు రిలయన్స్ జియో చెబుతున్న లెక్కల ప్రకారం 2018 వ సంవత్సరంకల్లా 4 జి మార్కెట్ లో దీని యూక వాటాను 16 శాతానికి పెంచుకోబోతోంది.

CLSA నిపుణుల అంచనా ప్రకారం జియో కు మొట్టమొదటిగా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ ఆదరణ లభించనున్నది.దాని సబ్ స్క్రైబర్ లలో 55 శాతం మంది ఎయిర్ టెల్ (కోటిన్నర),ఐడియా సెల్యూలర్ (కోటి),మరియు వోడాఫోన్ ఇండియా (2 కోట్లు) లనుండి రాబోతున్నారు.ఎందుకంటే 4 జి ని ఎంచుకునే వారిలో ఎక్కువ డేటా సబ్ స్క్రైబర్ లే ఉంటారు.కాబట్టి జియో మొదటగా వారినే టార్గెట్ చేసింది.కానీ ఈ రంగంలో పోటీ అంటే అది చాలా క్లిష్టత తో కూడుకున్న అంశం.దీనికి మరొక కారణం ఈ రంగంలో గణనీయ స్థాయిలో ఉన్న పోస్ట్ పెయిడ్ వినియోగదారుల సంఖ్య.జియో ను లాంచ్ చేసిన తర్వాత ఈ రంగంలో పెరిగిన పోటీ అనేది మిగతా పోటీ దారుల మీద కూడా విపరీతమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నది. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి మిగతా టెలికాం ఆపరేటర్ లు ప్రమోషనల్ ధరలను ప్రకటించవచ్చు.

రిలయన్స్ జియో యొక్క యజమాని అయిన ముఖేష్ అంబానీ గత నెలలో మాట్లాడుతూ 4 జి సేవలను ప్రారంభించడానికి తాము ఏంటో ఉత్సుకత తో ఎదురు చూస్తున్నామనీ తాము ఈ రంగం లో ప్రవేశించిన తర్వాత పోటీ తీవ్రంగా పెరగబోతోందనీ దానిని తట్టుకుని నిలబడేలా ప్రణాళికలు రచిస్తున్నామనీ ఒక ప్రకటనలో చెప్పారు.

టెక్ నిపుణుల విశ్లేషణ ప్రకారం 2018 వ సంవత్సరం కల్లా దేశంలో 4 జి వినియోగదారుల సంఖ్య 2 కోట్ల నుండి 18 కోట్ల కు చేరబోతోంది.కాబట్టి ఈ రంగం లో పోటీ అనేది విపరీతంగా ఉండబోతున్న నేపథ్యం లో స్మార్ట్ ఫోన్ ల సంఖ్య లోనూ విపరీతమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.చూద్దాం ఇంత పోటీ ని తట్టుకుని ఏ కంపెనీ నిలబడుతుందో.

 

జన రంజకమైన వార్తలు