టెలికాం, మొబైల్ ఫోన్ రంగంలో రిలయన్స్ నిత్యం ఏదో ఒక సంచలనానికి తెర తీస్తూనే ఉంది. ఈ క్రమంలో రిలయన్సు నుంచి మరో కొత్త ఫీచర్ ఫోన్ కూడా వస్తుందని.. అది స్మార్టు ఫోన్ల తరహాలో4జీ వీఓఎల్టీఈతో పనిచేస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి పలు ఫీచర్లు కూడా లీకయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ ఎలా ఉండొచ్చో చూద్దాం.
ఇది రిలయన్స్ లైఫ్ పేరుతో మార్కెట్లోకి రానుంది. 2.4 అంగుళాల టీఎప్టీ డిస్ ప్లే తో పాటు హిందీ ఇంగ్లీష్ బాషల్లో కీప్యాడ్ ఉంటుంది. ఇందులో 2 మెగా పిక్సెల్ కెమేరా ఉండనుంది. డ్యూయల్ సిమ్ మొబైల్ ఇది. ఇందులో జియో టీవీ, జియో సినిమా వంటి జియో యాప్స్ రన్ అవుతాయి. ఫేస్ బుక్ , వాట్సాప్ కూడా ఇందులో పనిచేస్తాయి.
స్పెసిఫికేషన్లు
* కాయ్ ఓఎస్
* 512 ఎంబీ ర్యామ్
* ఫ్లాష్ మొమోరీ 4జీబీ
* ఎస్డీకార్డుతో 128 జీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు
* ఫ్రంట్ కెమేరా వీజీఏ
* రియర్ కెమేరా 2 ఎంపీ
* బ్యాటరీ 2000 ఎంఏహెచ్
* వైఫై
* 4జీ వీఓఎల్టీఈ