టెలికాం ఇండస్ర్టీలో మెయిన్ ప్లేయర్ గా మారిపోయిన రిలయన్స్ జియో ఎప్పుడు ఏ ఆఫర్ ప్రకటిస్తోందో అని మిగతా సంస్థలు నిత్యం భయపడుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే జియో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వారిని డిఫెన్సులోకి నెట్టేస్తోంది. తాజాగా జియోఫై డివైస్ లపై మరో కొత్త ఆఫర్ ప్రకటించింది.
ఫ్రీ డాటా
అయితే.. కాల్స్, డాటాపై ఆఫర్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన జియో ఇంతవరకు తన జియో ఫై విషయంలో మరీ అంతగా ఆఫర్లే వెల్లువేమీ కురిపించలేదు. తాజాగా మాత్రం జియోఫై డివైస్ కొన్నవారికి ఉచిత డాటా ఇవ్వడానికి రిలయన్స్ రెడీ అయిపోయింది. ఇక నుంచి జియో ఫై కొనుగోళ్లపై 5జీబీ ఉచిత డాటా ఇవ్వనుంది.
వోచర్లను రెడీమ్ చేసుకోవాలి
అయితే... ఈ ఉచిత డాటాను ఒకేసారి ఇవ్వరు. పాత డోంగిల్ ఎక్స్చేంజిపై జియోఫై ను కొనుగోలు చేస్తే ఒక్కొక్కటి రూ.201 విలువైన 10 వోచర్లు వస్తాయి. అదే ఎక్స్చేంజి లేకుండా కొనుగోలు చేస్తే రూ.201 విలువైన 5 ఓచర్లు వస్తాయి. వీటిని రెడీమ్ చేసుకుంటే డాటా వస్తుంది.
జియో ప్రైం మెంబర్లకు మాత్రమే..
అయితే... ఒక వోచర్ రెడీమ్ చేసుకున్న తరువాతే రెండోది యాక్టివేట్ అవుతుంది. వేర్వేర్ డివైస్ లకు ఒకేసారి ఈ వోచర్లనీ వాడేయడం కుదరదు. అలాగే డాటా కాలపరిమితి కూడా మన ప్లాన్ ముగిసే తేదీపై ఆధారపడి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా జియో ప్రైం మెంబర్లకే ఈ ఫ్రీ డాటా వోచర్లు వర్తిస్తాయి.