కొద్దిరోజులుగా టెలికాం ఇండస్ర్టీలో.. మార్కెట్ వర్గాల్లో... సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తి కలిగిస్తున్న రిలయన్స్ ఇండస్ర్టీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో అనుకున్నట్లుగానే ముకేశ్ అంబానీ మరో సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు సమావేశంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేస్తారని ముందునుంచి అంచనాలు ఉన్నాయి... అందుకు తగ్గట్లుగానే ఆయన అందరి అంచనాలకు తగ్గట్లుగా, అందరి కోరికా తీరుస్తూ అత్యాధుకి 4జీ ఫీచర్ ఫోన్ ను ప్రకటించారు.అంతేకాదు... దీని ధర సున్నా అని ఆయన ప్రకటించారు.
దేశంలోని 50 కోట్ల మంది పీచర్ ఫోన్ల వాడకందార్ల క ోసమే ఈ కొత్త ఫోన్ లాంఛ్ చేస్తున్నట్లు చెప్పారు. కనెక్టివిటీ, డాటా అఫర్డబులిటీ, డాటా సపోర్టు ఉండేలా దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. జియోకు చెందిన యువ ఇంజినీర్లు దీన్ని రూపొందించారు.ఇండియా ఇంటెలిజెంట్ స్మార్టు ఫోన్ అని ముకేశ్ చెప్పిన దీని పేరు కూడా ‘జియో ఫోన్’.
ఇందులో వాయిస్ కమాండ్ సహాయంతో ఇంటర్నెట్ , కాల్స్ వంటి ఫీచర్లు వాడుకోవచ్చు. జియో టీవీ, మ్యూజిక్ వంటి యాప్స్ ప్రీలోడెడ్ గా వస్తున్నాయి.
స్పెసిఫికేషన్లు..
4 వే నేవిగేషన్
2.4 అంగుళాల డిస్ ప్లే
టార్చ్ లైట్
ఎఫ్ ఎం రేడియో