• తాజా వార్తలు

రూ 20,000/- ల ధర లోపు టాప్ సెల్ఫీ ఫోన్ లు ఇవే

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ల హవా నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించి కంప్యూటర్ తో చేసే అనేక రకాల పనులను చేయవచ్చు. అంతేగాక ఈ స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోనికి ప్రవేశించాక కెమెరా ల హవా తగ్గిందనే చెప్పవచ్చు. మోదయ స్థాయి ధరలలో నే అత్యద్భుతమైన కెమెరా క్వాలిటీ ని అందించే ఫోన్ లు నేడు అందుబాటులో ఉన్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్ లు అయితే DSLR కెమెరా ల క్వాలిటీ ని అందిస్తాయి. వీటి గురించి ఇంతకుముందే మన వెబ్ సైట్ లో ప్రచురించడం జరిగింది. అయితే ఈ కెమెరా ఫోన్ ల వలన అభివృద్ది చెందిన మరొక ట్రెండ్ సెల్ఫీ. అవును కెమెరా ఫోన్ లతో మామూలు ఫోటో లకంటే సెల్ఫీ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే రేర్ కెమెరా తో పాటు ఫ్రంట్ కెమెరా కూడా క్వాలిటీ ది అయినపుడే ఈ సెల్ఫీ ల ద్వారా తీసిన ఫోటో లు నాణ్యంగా వస్తాయి. ఈ నేపథ్యం లో రూ 20,000/- లలోపు లభించే అత్యుత్తమ సెల్ఫీ ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరుగుతుంది. ఒక లుక్కేయండి.

వివో V5

మద్య స్థాయి స్మార్ట్ ఫోన్ ల అమ్మకాల్లో టాప్ స్థానం లో ఉన్న వివో V5 పేరుతొ ఒక సెల్ఫీ ఫోకస్ద్ స్మార్ట్ ఫోన్ ను ఈ మధ్యనే లాంచ్ చేసింది. దీని ధర రూ 17,980/- లు గా ఉన్నది. ఇది 20 MP ఫ్రంట్ కెమెరా మరియు సోనీ  IMX 3761/2.78” sensor మరియు f/2.0 aperture, 5 p lens  తో లభిస్తుంది.

ఫోటో తీసేటపుడు పరిసరాలలో ఉండే లైట్ తో సంబంధం లేకుండా మీ ముఖంపై ఒక సహజ మైన వెలుగు ను ఇచ్చేందుకు వీలుగా ఇందులో మూన్ లైట్ గ్లౌ అనే ఫీచర్ ఉంటుంది. ఇందులోని కెమెరా యాప్ లో ఉండే ఫేస్ బ్యూటీ 6.0 మోడ్  అనేది సెల్ఫీ లను ఎన్ హాన్స్ చేయడమే గాక మీ ముఖాలను మరింత స్లిమ్ గా కనపడేవిధంగా చేస్తుంది. ఇది ఆటో మరియు మాన్యువల్ అనే రెండు ఆప్షన్ లలో లభిస్తుంది.

ఇది క్రౌన్ గోల్డ్ మరియు స్పేస్ గ్రే కలర్ లలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ మరియు ఇతర రిటైల్ స్టోర్ లలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Oppo F1S

ప్రస్తుతం వివో తో పాటు మధ్య స్థాయి వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్న ఫోన్ ఇది.  ఇది ఈ సంవత్సరం మొదట్లో F1S అనే ఫోన్ ను రూ 17,990/- ల ధర లో లాంచ్ చేసింది. అయితే దీనిని 4 GB RAM మరియు 64 GB స్టోరేజ్ కు అప్ గ్రేడ్ చేసి స్ట్రాంగ్ వెర్షన్ ను  రూ 18,990/- ల ధరలో ఈ మధ్యనే విడుదల చేసింది. ఇది 16 MP ఫ్రంట్ కెమెరా మరియు 1/3 ఇంచ్ సెన్సార్, 5 P లెన్స్ మరియు f/2.0 aperture లతో లభిస్తుంది. ఈ ఫీచర్ లు కెమెరా లోనికి ఎక్కువ కాంతి పడేలా చేసి తద్వారా ఇమేజ్ యొక్క నాణ్యత ను పెంచుతాయి.

ఈ ఫ్రంట్ కెమెరా బ్యూటీ 4.0 మోడ్ మరియు ఫిల్టర్ లు, సెల్ఫీ పనోరమా లాంటి అధునాతన ఫీచర్ లను కలిగిఉంటుంది. దీనికి LED ఫ్లాష్ తో కూడిన 13 MP రియర్ కెమెరా కూడా ఉంటుంది. ఇది ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.

జియోనీ S6s

జియోనీ S6s సెల్ఫీ కేంద్రక ఫీచర్ లతో లభిస్తున్న మరొక చైనీస్ హ్యాండ్ సెట్. ఇది LED ఫ్లాష్, f/2.2 aperture, 5 P లెన్స్ లతో కూడిన 8 MP ఫ్రంట్ కెమెరా ను కలిగిఉంటుంది. ఇందులో కూడా పనోరమా, HDR, ప్రొఫెషనల్, మేజిక్ ఫోకస్, ఫేస్ బ్యూటీ, పిక్ నోట్ మరియు అల్ట్రా పిక్సెల్ లాంటి అధునాతన ఫీచర్ లు ఉండడం వలన ఇవి 120 మెగా పిక్సెల్ రిసొల్యూషన్ ఇమేజ్ ను డెలివర్ చేస్తాయి. ఇందులో 13MP రియర్ కెమెరా కూడా ఉంటుంది. దీని ధర రూ 17,999/-లు ఉంటూ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.

మోటో M

ప్రముఖ కంపెనీ అయిన లెనోవ నుండి వచ్చిన ఈ మోటో M అనే మార్ట్ ఫోన్ 8 MP ఫ్రంట్ కెమెరా తో లభిస్తుంది. ఇది 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 1.12 um పిక్సెల్ సైజు లలో లభిస్తుంది. ఇంత వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా సెల్ఫీ లు తీయడం సులువు అవుతుంది. అంతేగాక బ్యూటిఫికేషన్ మోడ్ ద్వారా ఇమేజ్ లను మరింత అందంగా తయారుచేసుకోవచ్చు.

దీని రియర్ కెమెరా 16 MP సెన్సార్ మరియు LED ఫ్లాష్ ను కలిగిఉంటుంది. ఇది కూడా ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.

లెనోవా Z2 ప్లస్

ఈ లెనోవా Z2 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ 8 MP ఫ్రంట్ కెమెరా తో లభిస్తుంది. ఈ కెమెరా 1.4 um పిక్సెల్ సైజు, f/2.0 aperture, మరియు 78.9 డిగ్రీ వైడ్  యాంగిల్ లను కలిగిఉంటుంది.. అంతేగాక ఈ కెమెరా 1080 p వరకూ వీడియో ను రికార్డు చేయగలుగుతుంది. దేని రియర్ కెమెరా కూడా 13 MP మరియు ఇతర అధునాతన ఫీచర్ లను కలిగి ఉంటుంది. దీని ధర రూ 17,999/- లు ఉంటూ అమజాన్ లో లభిస్తుంది.

సోనీ ఎక్స్ పీరియా xA డ్యూయల్

కెమెరా పనితనానికి ఇది మారుపేరుగా నిలుస్తుంది. కిది 8 MP ఫ్రంట్ కెమెరా మరియు రెస్పాన్సివ్ సెన్సార్ లతో లభిస్తుంది. దీనివలన తక్కువ కాంతి ఉన్న పరిస్థితులలో కూడా మంచ్ నాణ్యమైన ఇమేజ్ లను అందిస్తుంది. ఇది లో లైట్ ఫోటోగ్రఫి కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. దీని రియర్ కెమెరా కూడా 13 MP మరియు Exmor సెన్సార్ తో లభిస్తుంది. రూ 15,700 /- లలో లభించే ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు అమజాన్ లలో అందుబాటులో ఉంటుంది.

ఆసస్ జెన్ ఫోన్ సెల్ఫీ

ఈ ఫోన్ పేరుకు తగ్గట్లే సెల్ఫీ కోసమే డిజైన్  13 చేయబడింది. ఇది 13 MP ఫ్రంట్  కెమెరా తో లభిస్తుంది. ఇందులో పిక్సెల్ మాస్టర్, LED ఫ్లాష్ , f/2.2 aperture, మరియు 88 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ లాంటి ఫీచర్ లను కలిగిఉంటుంది. ఇవి మాత్రమే గాక లో లైట్ మోడ్, బ్యూటిఫికేషన్ మోడ్, స్లేఫీ పనోరమా మోడ్ లాంటి అధునాతన ఫీచర్ లు కూడా ఇందులో ఉంటాయి. పిక్సెల్ మాస్టర్ యొక్క లో లైట్ ఫీచర్ వలన రాత్రి సమయాలలో కూడా ఫోటో లు మరియు వీడియో లు మరింత స్పష్టంగా తీయగలము. 13 MP రియర్ కెమెరా తో కూడా లభించే ఈ ఫోన్ ధర రూ 16,999/- లు ఉంటూ ఫ్లిప్ కార్ట్ మరియు అమజాన్ లలో అందుబాటులో ఉంటుంది.

Le Max 2

లీ ఎకో స్మార్ట్ ఫోన్ కంపెనీ ఈ సంవత్సరం మొదట్లో 8 MP ఫ్రంట్ కెమెరా, f/2.2 aperture, 75.1 డిగ్రీ FOV లను కలిగి ఉంటుంది.ఒకేసారి ఎక్కువమంది ఉండే గ్రూప్ ఫోటో లను నాణ్యంగా తీయడానికి ఇందులో బ్యూటీ మోడ్ ఉంటుంది. దీనిద్వారా తీసిన సెల్ఫీ లు అద్భుతమైన క్వాలిటీ ని కలిగిఉంటుంది. ఇక రియర్ కెమెరా విషయానికొస్తే ఇది 21 MP ని కలిగిఉండి మరెన్నో అధునాతన ఫీచర్ లను కలిగి ఉంటుంది. రూ 17,999/- లు ఉండే  ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు అమజాన్ లలో లభిస్తుంది.

జియోమీ రెడ్ మీ నోట్ 3

ఈ సెల్ఫీ ల అంశానికి సంబందించి ఈ జియోమీ రెడ్ మీ నోట్ 3 తిరుగులేని రాజు అనేది నిర్వివాదాంశం. ఇది 5 MP ఫ్రంట్ కెమెరా, f/2.0 aperture, లను కలిగిఉండడమే గాక 1080 p వీడియో ను రికార్డు చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

16 MP రియర్ కెమెరా ను కలిగి ఉండే దీని ధర రూ 9999/- లు ఉంటూ అమజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంటుంది.

సామ్సంగ్ గాలక్సీ ఆన్ NXt

ఈ స్మార్ట్ ఫోన్ ను సామ్సంగ్   ఈ మధ్యనే లాంచ్ చేసింది. ఇది 8 MP ఫ్రంట్ కెమెరా, f/1.9 aperture తో లభోస్తుంది. LED ఫ్లాష్ ను కలిగిఉండే 13 MP రియర్ కెమెరా ను కలిగిఉంటుంది. ఇది ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.

జన రంజకమైన వార్తలు