లాప్‌టాప్ ఇప్పుడు ఎంతో అవసరమైన వస్తువు. కానీ దీని ధర మాత్రం అందరికి అందుబాటులో ఉండదు. ఇప్పుడిప్పుడే లాప్‌టాప్ ధరలు తగ్గుతున్నా... అవి మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఐబాల్ కంపెనీ ప్రపంచంలోనే చౌక ధరకు విండోస్ 10 లాప్‌టాప్‌ను తయారు చేసింది. ఇది రూ.9999కే మార్కెట్లోకి తీసుకోస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. వినియోగదారులకు అవసరమైన కనీస అవసరాలు తీర్చేలా దీన్ని రూపొందించారు. ఇంటెల్, మైక్రోసాఫ్ట్‌లతో ఒప్పందం చేసుకుని ఈ లాప్‌టాప్‌ను తయారు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. భారత్‌లో డిజిటల్ విప్లవంలో తమ లాప్‌టాప్ కూడా భాగం అవుతుందని ఐబాల్ పేర్కొంది. ఈ ఐబాల్ కామ్‌బుక్ లాప్‌టాప్‌లను రెండు డిజైన్లలో మార్కెట్లోకి వదిలింది ఆ సంస్థ. 11 అంగుళాల ఎక్స్‌లెన్స్, 14 అంగుళాల ఎగ్జామ్‌ప్లయర్ పేర్లతో విడుదలైన ఈ లాప్‌టాప్ వినియోగదారులను విశేషంగా ఆకట్టకుంటుందని ఆ సంస్థ భావిస్తోంది. ఈ లాప్‌టాప్ రూ.9999 ధరతో పాటు 13,999 ధరకు కూడా లభ్యం అవుతోంది. భారత్‌లో అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లలో ఐబాల్ కామ్‌బుక్ లాప్‌టాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. విండోస్ 10 ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ డివైజ్‌లను అమ్ముతోంది. ఈ లాప్‌టాప్‌లు విండోస్ 10 హోమ్ అండ్ ప్రొ వెర్షన్స్‌లో లభ్యం కానుంది. భారత్‌లో లాప్‌టాప్ వాడకాలను మరింత పెంచే ఉద్దేశంతో ఐబాల్ ఇంత తక్కువ ధరలో లాప్‌టాప్‌లను అందిస్తోందని ఆ సంస్థ తెలిపింది. కొత్త యూజర్లను ఆకర్షించడానికి కూడా ఈ తక్కువ ధర లాప్‌టాప్ ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెప్పింది. ఈ లాప్‌టాప్ ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రొసెసర్‌తో తయారు చేశారు. దీని వేగం 1.83 గిగా హెట్జ్. దీనిలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇన్‌బిల్ట్‌గా ఉంచారు. ఇది 2జీబీ ర్యామ్‌తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సౌకర్యంతో తయారైంది. ఈ మొమరీని 64 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. |