స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు అనేక పాటలు తమ ఫోన్ లో స్టోర్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు. అందులో మనకు ఇష్టం ఉన్న పాటలు చాలా ఉంటాయి.. కాని ఇంకా మంచి పాటలు ఉంటె బాగుండు అనుకుంటాము. లేకపోతే విన్నవే విని విని బోర్ కొట్టొచ్చు అలాంటప్పుడు కొత్త పాటలు ఉంటే బాగుందు అనుకోవచ్చు. మీలాంటి వారి కోసమే కేవలం 2 రూపాయలకే పాటల్ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది 'Saregama' యాప్. అంతే కాదు దీనిలో పైరసీ అన్న పదం లేకుండా అన్ని పాటలు లీగల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దాదాపు 1.1 లక్ష్యల పాటలు అందులో నిక్షిప్తతం అయి ఉంటాయి. ఇందులో వివిధ రకాల బాషల పాటలు కూడా ఉన్నాయి. వీటిని H.Dలో కూడా కేవలం 10 రూపాయలు చెల్లించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే హంగామా, సావన్ వంటి యాప్స్ ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కాని వాటిలో ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ యాప్ లో అతి తక్కువ ధరకు మనకు నచ్చిన సింగర్స్ పాడిన పాటల్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. |