• తాజా వార్తలు

ఎల్‌జీ జీ 6పై 10 వేల రూపాయ‌ల భారీ డిస్కౌంట్

ఎల్‌జీ త‌న కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6' పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ లాంచింగ్ కాస్ట్ 51.990 రూపాయ‌లు. ఇప్పుడు దీనిపై రూ.10 వేల తగ్గింపు ఇస్తున్న‌ట్ల కంపెనీ ప్ర‌క‌టించింది. అంటే 41,990 రూపాయ‌ల‌కు ఈ ఫోన్ దొరుకుతుందని ముంబై రీటైలర్ మ‌హేష్ టెలికాం చెప్పారు. మే 18 నుంచి జూన్ 15 వ‌ర‌కే ఈ ఆఫ‌ర్ ఉంటుంద‌న్నారు. మిగ‌తా ఈ -కామ‌ర్స్ సైట్ల‌లో ఈ ఆఫ‌ర్ ఉందా లేదా అనేది క్లారిటీ లేదు.
స్పెష‌ల్ స్పెక్స్ చాలా ఉన్నాయ్‌
2017 వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ రిలీజ్ చేసింది. డ్యూయల్‌ కెమెరాలతో విడుద‌లయిన ఈ ఫోన్ ఏప్రిల్‌లో ఇండియ‌న్ మార్కెట్‌లోకి వ‌చ్చింది. 5.7 ఇంచెస్ డిస్‌ప్లే, డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరాలు ఇలా చాలా స్పెష‌ల్ స్పెక్స్ ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. డాల్బీ విజ‌న్ వ్యూయింగ్ టెక్నాల‌జీతో వ‌చ్చిన సెల్‌ఫోన్ ప్ర‌పంచంలో ఇదే మొద‌టిద‌ని ఎల్జీ ప్ర‌క‌టించింది.
ఫీచ‌ర్లు ఇవీ
* 5.7 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే * 1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ * 4 జీబీ ర్యామ్ * క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ * ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్ * 64 జీబీ ఇంటర‍్నల్‌ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ * రియ‌ర్ సైడ్ 13, 13 మెగాపిక్సెల్స్‌తో డ్యుయల్ కెమెరాలు * 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా * 3300 ఎంఏహెచ్ బ్యాటరీ

జన రంజకమైన వార్తలు