ఒక మోస్తరు ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా కూడా రూ.5 వేలకు తక్కువకు దొరకదు. కానీ, రూపాయికే బ్రహ్మాండమైన స్మార్ట్ ఫోన్ అమ్ముతామంటోంది చైనాకు చెందిన సంస్థ ఒకటి. అవును... నిజమే, అయితే, దీనికో ట్విస్టుంది. ఆ సంస్థ పెడుతున్న చిన్న కాంపిటీషన్లో పాల్గొని సక్సెస్ అయితేనే రూపాయికే ఫోన్ ఇస్తారు. లేదంటే దాని ధర రూ.6,999. చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మిజు.. ఎం2 పేరుతో కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.6,999. స్నాప్‌డీల్ లో దీన్ని విక్రయానికి పెట్టారు. ఐతే ఒక రూపాయికే ఈ ఫోన్‌ని పొందే అవకాశాన్ని కల్పిస్తోందీ సంస్థ. ''రూ.1 కే ఎం2'' అంటూ ఓ ఆన్లైన్ కాంటెస్ట్ని సైతం ప్రకటించింది. దీనికి మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే. మిజు లోగో ఫోన్‌పై ఎక్కడ వేయాలి... ఆ లోగో ఎలా ఉండాలి అనేది వారికి సూచిస్తూ ఒక బొమ్మగీసి పంపించాలి. పంపించడం కూడా చాలా ఈజీ.. ఆ చిత్రాన్ని మిజు ఇండియా ఫేస్బుక్ పేజీలో #?M2FOR1 హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చెయ్యాలి. ఈ నెల 21 వరకే ఈ అవకాశం ఉంది. అలా వచ్చిన చిత్రాల్లో మంచి వాటిని సంస్థ ఎంపిక చేసి వాళ్లందరికీ రూపాయికే ఎం2 ఫోన్‌ని ఇస్తారు. ఈ పోటీలు గీటీలు మనకు సరిపడవు అనుకున్నవారు రూ.6,999 చెల్లిస్తే స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మిజు ఎం2 ప్రత్యేకతలు ఇవీ..
|