టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఇండియన్ మార్కెట్లోకి 4జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. అల్యూమినియం ఎడిషన్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 4జీ స్మార్ట్ వాచ్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా రిలీజ్ చేసింది. కేవలం 18 వాచ్‌లు మాత్రమే విడుదల చేస్తామని శాంసంగ్ ప్రకటించింది.
ఇవీ ఫీచర్లు
* శాంసంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2.. 4జీ అల్యూమినియం వాచ్ 1.4 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
* డిస్‌ప్లే గుండ్రంగా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డీఎక్స్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంది.
* 1.5 జీబీ ర్యామ్
* 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 4జీ ఎల్టీఈ, వైఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ 5.0, కనెక్షన్లు ఉన్నాయి.
* శాంసంగ్ సొంత ఓఎస్ అయిన టైజన్‌తో పని చేస్తుంది.
* 340 ఎంఏహెచ్ బ్యాటరీ. ఒక్కసారి ఫుల్ ఛార్జి చేస్తే 60 గంటలు పని చేస్తుంది.
* ఆక్వా బ్లూ, క్లౌడ్ సిల్వర్, పింక్ గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది.
ధర
ధర రూ.28,490. శాంసంగ్ రిటైల్ స్టోర్స్, శాంసంగ్.కామ్‌తోపాటు ఈకామర్స్ పోర్టల్స్‌లో దొరుకుతుంది. జులై 31 వరకు నోకాస్ట్ ఈఎంఐ, 10% క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఇస్తోంది.
మేకిన్ ఇండియా ప్రొడక్ట్
మేకిన్ ఇండియాలో భాగంగా వీటిని పూర్తిగా ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్లాంట్‌లోనే తయారు చేయనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది.