• తాజా వార్తలు

శాంసంగ్ ఎస్7 తయారీకి ఖర్చు ఎంతో తెలుసా?

రూ.16 వేల లోపే తయారీ ఖర్చు-- ఐహెచ్ఎస్ సర్వే

మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జు స్మార్టుఫోన్లు కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా అమ్మకాలు జరిగి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.  అయితే సుమారు రూ.50 వేల ధర చెబుతున్న ఈ ఫోన్ల తయారీ ఖర్చు చాలా తక్కువట. రూ.16 వేల లోపే తయారీ ఖర్చు ఉన్న వీటిని భారీ ధరకు విక్రియంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 సిరీస్ ఫోన్ల తయారీ కోసం కేవలం రూ.16 వేలు మాత్రమే ఖర్చుచేస్తున్నట్లు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మార్కెట్లో కొన్ని సర్వేలలో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 వెర్షన్ ఉన్న ఎస్ 7 కోసం 255 డాలర్లు(భారత కరెన్సీలో కేవలం రూ. 15,750) అవుతుందట. సాఫ్టువేర్ రీసెర్చి , మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, పన్నులు ఇతర రకాల అలవెన్సులు ఇందుకు అదనంగా కలుపుకొని విక్రయిస్తున్నట్లు  మార్కెట్ అనలిస్టు సంస్థ  ఐహెచ్ఎస్ సర్వేలో తేలింది.

కాగా గెలాక్సీ ఎస్7 ధర రూ.48,900 ఉండగా, గెలాక్సీ ఎస్7 ఎడ్జు ధర రూ.56,900 లతో శాంసంగ్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే, గెలాక్సీ ఎస్ 7 ఉత్పత్తికి అయ్యే ఖర్చు గెలాక్సీ ఎస్5 కంటే ఒక డాలర్ (దాదాపు రూ.70) తక్కువ పడుతుందట. గెలాక్సీ ఎస్5 మార్కెట్లోకి వచ్చిఇప్పటికీ రెండేళ్లు అవుతుంది. ఆపిల్ ఉత్పత్తులను పూర్తిగా అధిగమించి విక్రయాలను చేయాలని కసరత్తులు చేస్తోంది. బార్సిలోనాలో గత నెలలో ప్రవేశపెట్టిన ఈ ఫోన్లను  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఇవి వాటర్, డస్టు రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లూ కూడా మార్చి 18 నుంచి అందుబాటులోకి ఓపెన్ మార్కెట్లో దొరకనున్నాయి. కాగా వీటి ప్రచారానికి కూడా శాంసంగ్ భారీగా ఖర్చు చేస్తోంది. కేవలం అడ్వర్టయిజ్ మెంట్లకే రూ.100 కోట్లు కేటాయించినట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

జన రంజకమైన వార్తలు