భారత్‌లో మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి శాంసంగ్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. యాపిల్ నుంచి ఎదురవుతున్న పోటీ నుంచి తట్టుకోవడానికి ఆ కంపెనీని దెబ్బ కొట్టేందుకు శాంసంగ్ వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడింది. మేక్ ఇన్ ఇండియా సెలబ్రేషన్‌లో భాగంగా శాంసంగ్‌కు సంబంధించిన వివిధ మోడల్స్‌కు డిస్కౌంట్లు ప్రకటించింది. మే 15 వరకు ఈ డిస్కౌంట్లు అమల్లో ఉంటాయని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పింది. ఈ రాయితీలు కేవలం స్మార్టుఫోన్ల మీదే కాక ట్యాబ్లెట్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లకు రాయితీలను ప్రకటించింది. ఈ ఆఫర్ల కోసం ప్రత్యేకంగా ఒక పేజీని తయారు చేసి క్యాష్‌బ్యాక్, ఈజీ ఈఎంఐ, ఫ్రీబీస్ లాంటి సర్వీసులను అందజేస్తోంది శాంసంగ్. తమ కంపెనీకి చెందిన అన్ని స్మార్టుఫోన్లతో పాటు గెలాక్సీ 6, గెలాక్సీ నోట్ 5 మోడళ్లకు కూడా శాంసంగ్ ఆఫర్లు పెట్టింది. గెలాక్సీ ఎస్6 మోడల్‌ను రూ.33900కు, గెలాక్సీ నోట్ 5 మోడల్‌ను రూ.42,900కు శాంసంగ్ ఇస్తోంది. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల మీద 10 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఇస్తోంది. గెలాక్సీ ఏ7, గెలాక్సీ ఏ5, గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ మోడల్స్‌కు కూడా శాంసంగ్ ఈ ఆఫర్లు ఇస్తోంది. గెలాక్సీ ఏ7 రూ.29,900, గెలాక్సీ ఏ5 రూ.24,900, గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ రూ.8250 ధరకు లభ్యమవుతున్నాయి. ఐతే కేవలం స్మార్టుఫోన్లకు మాత్రమే కాక స్మార్టు టీవీలకు కూడా శాంసంగ్ ఈ ఆఫర్లను ప్రకటించింది. యూహెచ్-డీ ఫ్లాట్ స్మార్టు టీవీ, ఫుల్ హెచ్‌డీ కర్వర్డ్ టీవీ, ఫుల్ హెచ్ డీ ఫ్లాట్ టీవీలకు ఆఫర్లను ఇచ్చింది. ఇక రిఫ్రిజిరేటర్లు, టాబ్లెట్లకయితే 10 ఏళ్ల వారెంటీ ఇస్తోందీ సంస్థ. భారత్‌లో వినియోగదారులు శాంసంగ్ ఉత్పత్తులపై ఎంతో నమ్మకంతో ఉన్నారని.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే మరిన్ని ఆఫర్లతో వచ్చామని అంటోంది శాంసంగ్ సంస్థ. మేక్ ఫర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా తామిచ్చిన ఈ ఆఫర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని శాంసంగ్ భావిస్తోంది. కొత్త కొత్త ఆలోచనలు, భిన్నమైన ఆఫర్లతో వినియోగదారులు శాంసంగ్ ఉత్పత్తులు కొనేలా చేయాలనేది శాంసంగ్ కంపెనీ ఆలోచన. |