దేశీయ మొబైల్ తయారీ సంస్థలు, చైనా కంపెనీల నుంచి పోటీ తీవ్రమవడంతో శాంసంగ్ వంటి సంస్థలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అయితే... మార్కెట్లో ఎంత పోటీ ఉన్నా కూడా బ్రాండ్ ఇమేజి, నాణ్యత ఆధారంగా శాంసంగ్ ఇంకా దుమ్ము రేపుతోంది. నిత్యం ఏదో ఒక మొబైల్ విడుదల చేస్తూ మార్కెట్ల పై తన పట్టును కాపాడుకుంటోంది. తాజా శాంసంగ్ గెలాక్సీ జె3 ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.8,990. ప్రస్తుతం స్నాప్‌డీల్ సైట్ ద్వారా వినియోగదారులకు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జె3 ఫీచర్లు...
5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 'శాంసంగ్ గెలాక్సీ ఎ9 ప్రొ'... ప్రస్తుతం దీన్ని చైనా మార్కెట్‌లోకి విడుదల చేశారు. త్వరలోనే ఇది భారత్‌లోనూ విడుదల కానుంది. రూ.35,700 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది.
సంచలనం రేపుతోన్న శాంసంగ్ వాచ్ మొబైళ్లతోనే కాకుండా వేరబుల్స్ మార్కెట్లోనూ శాంసంగ్ దుమ్ము రేపుతోంది. తన గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన మూడు కొత్త వేరియంట్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త యాప్స్, డయల్ ఫేసేస్‌తో కనువిందు చేస్తున్న ఈ వేరబుల్ డివైస్‌లను అన్ని సామ్‌సంగ్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంచారు. వైట్ వేరియంట్ ధర రూ.24,300 కాగా, క్లాసిక్ గోల్డ్, ప్లాటినమ్ వేరియంట్ ధర రూ.34,900. ఉబెర్ క్యాబ్ సర్వీసెస్, గుడ్‌నెట్ స్లీప్ ట్రాకింగ్, మై నోట్సు, Xenozu (యూట్యూబ్ బ్రౌజింగ్) వంటి యాప్‌లతో పాటు గేమ్సు, హెల్త్ , ఫిట్నెస్, కనెక్టివిటీ, లైఫ్‌స్టైల్ సొల్యూషన్స్‌కు సంబంధించిన ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని కూడా ఈ వాచ్‌లో సామ్‌సంగ్ పొందుపరిచారు. గేమింగ్ ప్రియులు ఈ వాచ్ ద్వారా సరికొత్త గేమింగ్ అనుభూతిని పొందవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఛాసిస్‌తో వస్తోన్న ఈ డివైస్ ఆకర్షణీయంగా ఉండడంతోపాటు మణికట్లుకు చక్కగా అమరేలా వుంది. |