• తాజా వార్తలు

ఈ హెడ్‌ఫోన్స్ ఖ‌రీదు జ‌స్ట్ 45 ల‌క్ష‌లు


ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆడియో ఉత్ప‌త్తుల సంస్థ సెన్‌హైజ‌ర్ త‌న కొత్త మోడ‌ల్ హెడ్‌ఫోన్లను ఇండియ‌న్ మార్కెట్‌లో తీసుకొచ్చింది. సెన్‌హైజ‌ర్ హెచ్ఈ 1 అనే ఈ హెడ్‌ఫోన్ ట్యూబ్ యాంప్లిఫైర్‌తో అత్యంత నాణ్య‌మైన సౌండ్‌ను అందిస్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. అత్యంత కాస్ట్‌లీ హెడ్‌ఫోన్స్‌గా నిలిచిపోనున్న ఈ సెన్‌హైజ‌ర్ హెచ్ఈ 1 హెడ్‌ఫోన్స్ మే 27 నుంచి ఇండియాలో అందుబాటులోకి వ‌స్తాయి.

డ‌బుల్ బెడ్‌రూమ్ ఇల్లు కొనుక్కోవ‌చ్చు
ఆర్ఫీస్ రేంజ్‌లో ప్రీమియం హెడ్‌ఫోన్ల‌ను రెండేళ్ల‌క్రితం సెన్‌హైజ‌ర్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 35 ల‌క్ష‌ల 31 వేల రూపాయ‌ల ధ‌ర‌ని చెప్ప‌డంతో అప్ప‌ట్లోనే ఈ హెడ్ ఫోన్స్ గురించి క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకున్నారు. ఇప్ప‌డు సెన్‌హైజ‌ర్ హెచ్ఈ 1 హెడ్‌ఫోన్స్ ధ‌ర దాన్ని మించిపోయింది. అదెంతో తెలిస్తే గుండె గుబేలుమ‌న‌డం ఖాయం. ఎందుకంటే దీని ధ‌ర అక్ష‌రాలా 45 ల‌క్ష‌ల రూపాయ‌లు. ఈ డ‌బ్బుతో హైద‌రాబాద్‌లో ఓ డ‌బుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనుక్కోవ‌చ్చు. అయితే ధ‌ర‌కు త‌గ్గ‌ట్లు ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ క్వాలిటీతో కూడిన సౌండ్‌ను అందిస్తామ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఇండియ‌న్ మార్కెట్‌లో త‌మ హెడ్‌ఫోన్ల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని కంపెనీ కాన్ఫిడెంట్‌గా చెప్ప‌డం విశేషం.

8 వాక్యూమ్ ట్యూబ్‌ల‌తో యాంప్లిఫైయ‌ర్
సుపీరియ‌ర్ క్వాలిటీ సౌండ్‌ను అందించే సెన్‌హైజ‌ర్ హెచ్ఈ 1 హెడ్‌ఫోన్స్ త‌యారీకి ఏకంగా ప‌దేళ్ల‌పాటు రీసెర్చి చేశామ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ హెడ్‌ఫోన్ల ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ హ్యూమ‌న్ హియ‌రింగ్ రేంజ్‌ను ఎక్స్‌పాండ్ చేసే స్థాయిలో ఉంటుంద‌ని చెబుతోంది. సౌండ్‌ను ఎన్‌హేన్స్ చేయ‌డానికి 8 వాక్యూమ్ ట్యూబ్‌ల‌తో కూడిన యాంప్లిఫైయ‌ర్‌ను దీనికి అమ‌ర్చారు. ఈ యాంప్లిఫైయ‌ర్ నుంచి అల్ట్రా హై ఇంప‌ల్స్ యాంప్లిఫైయ‌ర్ స్టేజ్‌తో ఇయ‌ర్‌క‌ప్స్‌కు క‌నెక్ట్ అవుతుంది. గోల్డ్ వాప‌రైజ్డ్ సిరామిక్ ఎల‌క్ట్రోడ్స్‌, ప్లాటినం వేప‌రైజ్డ్ డ‌యాఫ్రమ్స్‌ను బెట‌ర్ సౌండ్ అవుట్‌పుట్ కోసం అమ‌ర్చారు. 8 హెర్ట్జ్ నుంచి 100 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని అందిపుచ్చుకోగ‌ల‌దు.

జన రంజకమైన వార్తలు