పెద్ద కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ రేంజిలో ఉన్న ఫోన్లను మార్కెట్లోకి విస్తృతంగా తీసుకొస్తోంది. తాజాగా అది తన కాన్వాస్ సిరీస్ నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. డ్యుయల్ ఫ్రంట్ స్పీకర్ ప్రత్యేకతతో వస్తోన్న ఈ ఫోన్ మోడల్ ‘మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 3'. ఆన్‌లైన్ లో దీని ధర రూ.6,499.
ఇవీ ప్రత్యేకతలు...
- మెటాలిక్ ఫినిష్‌తో ట్రెండీ లుక్
- 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్)
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
- 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ 6582ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్
- ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.
- 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే వీలు
- 5 మెగా పిక్పల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా,
- 3జీ, జీపీఆర్ఎస్, వై-పై, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. రెండు సిమ్ లు వేసుకోవచ్చు.
- 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ...
|