• తాజా వార్తలు

ప్రపంచలోని అతి చిన్న ఫోన్ ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది

    ప్రపంచంలోనే అత్యంత చిన్న ఫోన్ ఏది? ఎవరు ఏం చెప్పినా కూడా దీనికి అసలైన సమాధానం మాత్రం ‘నానో ఫోన్ సి’. అవును.. ఢిల్లీకి చెందిన ఈ-కామర్స్ సంస్థ యెహ్రా.కామ్ లో గురువారం నుంచి ఈ నానో ఫోన్ ను విక్రయానికి ఉంచారు. రష్యాకు చెందిన ఎలారి అనే సంస్థ దీన్ని తయారు చేసింది. ప్రస్తుతం ఇది భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.
    ‘నానో సి’ ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లతో అనుసంధానం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోని వెయ్యి కాంటాక్ట్‌లను సింగిల్ క్లిక్‌తో ఈ ఫోన్‌లో కాపీ చేసుకోవచ్చు. రోజ్, గోల్డ్, బ్లాక్ అండ్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని ధరద రూ.3940
    ఇవీ స్పెసిఫికేషన్లు
* 7.6 మిల్లీమీటర్ల మందం, 94.4 X 35.85 మిల్లీమీటర్లతో ఉన్న ఈ ఫోన్ బరువు 30 గ్రాములు మాత్రమే. 
* 1 అంగుళం టీఎఫ్‌టీ డిస్‌ప్లే
* 32 ఎంబీ ఇన్ బిల్ట్ స్టోరేజి
* 32 జీబీ ఎక్సటర్నల్ స్టోరేజి
* ఎంపీ 3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, అలారం
 

జన రంజకమైన వార్తలు