• తాజా వార్తలు

స్మార్ట్‌ఫోన్ల‌లో కొత్త టెక్నాల‌జీలు -3 .. వైఫై కంటే 100 రెట్లు స్పీడైన లైఫై

సెల్‌ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌గా మార‌డానికి దశాబ్దాలు ప‌ట్టింది. కానీ ఆ త‌ర్వాత ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌తో, కొత్త టెక్నాల‌జీ అడ్వాన్స్‌మెంట్స్‌తో  జ‌నాన్ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి. అలాంటి స్మార్ట్‌ఫోన్ల‌లో త్వ‌‌ర‌లో రాబోతున్న కొత్త కొత్త టెక్నాల‌జీల గురించి రోజూ ఒకటి మీకు ప‌రిచయం చేస్తోంది కంప్యూట‌ర్ విజ్ఞానం.  నిన్న‌టి ఆర్టిక‌ల్‌లో బ‌ట‌న్లు, పోర్ట్‌లు లేని స్మార్ట్‌ఫోన్ గురంచి చూశారు క‌దా.. ఈసారి మ‌రో కొత్త అంశం.. అదీ స్మార్ట్‌ఫోన్ క‌నెక్టివిటీ గురించి. వైఫై కంటే 100 రెట్లు స్పీడ‌యిన లై ఫై గురించి.. 

క‌నెక్టివిటీకి కొత్త ఫీచ‌ర్ 
బ్లూటూత్ ఒక‌ప్పుడు సెల్‌ఫోన్ల‌కు  ఎక్స్‌ట‌ర్న‌ల్ క‌నెక్టివిటీకి ఉన్న ఏకైక ఆప్ష‌న్ ఒక‌ప్పుడు బ్లూటూత్ మాత్ర‌మే. ఇప్పుడు వైఫై వ‌చ్చాక బ్లూటూత్‌ను కేవ‌లం ఇయ‌ర్‌బ‌డ్స్ క‌నెక్ట్ చేసుకోవ‌డానికి మాత్ర‌మే వాడుతున్నాం. వైఫై వ‌చ్చాక ఫోన్‌కి క‌నెక్టివిటీ పెరిగింది. ఇంట‌ర్నెట్‌కు స్పీడ్‌గా క‌నెక్ట్ చేసుకుంటున్నాం. డేటాను స్పీడ్‌గా వాడుకోగ‌లుగుతున్నాం. అప్‌లోడ్‌, డౌన్‌లోడ్ కూడా స్పీడ‌య్యాయి. ఇప్పుడు వైఫై ప్లేస్‌లో లైఫైను తీసుకొచ్చేందుకు కంపెనీలు ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టాయి.

ఏమిటీ లైఫై?
వైఫై అంటే రేడియో త‌రంగాల  ఫ్రీక్వెన్సీని బ‌ట్టి ప‌నిచేస్తుంది. అదే లైఫై అంటే రేడియో త‌రంగాల బ‌దులు కాంతి త‌రంగాల‌ను వాడుకుంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఎల్ఈడీ లైట్ల ద్వారా క‌నెక్ట్ అవుతుంది. దీని ద్వారానే ఇది డేటాను కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తుంది.
* లైట్ ఎంత త‌క్కువ‌గా ఉన్నా, ఆఖ‌రికి మ‌నం కంటితో చూడ‌లేని కాంతిలో కూడా క‌నెక్టివిటీ, డేటా ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌గలిగేలా లైఫెను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. 
* వైఫై కంటే లైఫై 100 రెట్లు స్పీడ్‌గా ఉంటుంద‌ట‌.  
* అంతేకాదు క‌నెక్టివిటీ రేంజ్ కూడా  వైఫైతో కంపేర్ చేస్తే చాలా ఎక్క‌వు. దాదాపు కిలోమీట‌ర్ వ‌ర‌కు క‌నెక్టివిటీ ఉంటుంద‌ట‌. 

ఒప్పో వ‌ర్క‌వుట్ చేస్తోంది
లైఫైను స్మార్ట్ ఫోన్ల‌లో తీసుకురావ‌డానికి చైనా మొబైల్ కంపెనీ ఒప్పో ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్లలో లైఫై వాడేందుకు వీలుగా ఈ టెక్నాల‌జీ మీద పేటెంట్ కూడా తీసుకుంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే లైఫై ఫోన్లు వ‌మచ్చే ఏడాదే అందుబాటులోకి రావ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు