• తాజా వార్తలు

త్వరలో ఈ మెయిల్ ఐ డి. లను తెలుగులోను వాడొచ్చా ?

త్వరలో ఈ మెయిల్ ఐ డి. లను తెలుగులోను వాడొచ్చా ?

ఈ మెయిల్ ఐ డి లను త్వరలో రీజనల్‌ లాంగేజ్‌లలో కూడా క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇంత వరకూ కేవలం ఇంగ్లీష్‌లో మూత్రమే ఉండే ఈమైల్‌ మనకు నచ్చిన బాషలో క్రియేట్‌ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో 2లక్షల యాబైవేల గ్రామాలకు మోడీ ప్రభుత్వం తక్కువ ధరలో నెట్‌ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇదే గనుక జరిగితే ఇంగీష్‌పై అవగాహన లేని వారు తమ తమ మాతృభాషలో ఈమైల్స్‌ ఉంటేనే వారికి అర్థ అవుతుందన్న ఉద్దేశంతో దీనికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. కేవలం నెట్‌ ఇచ్చినంత మాత్రానా లాభం లేదని సదరు ప్రాంతీయ బాషలో ఉన్నప్పుడే వారికి అర్థమవుతుందని కొన్ని కంపెనీలు పెదవి విరవడంతో ఈ మేరకు ఈమైల్స్‌ని క్రియేట్‌ చేయడానికి అంగీకరించారు. ఇప్పటికే మైక్రోసాప్ట్‌ చైనీస్‌ బాషలో క్రియేట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. చైనీస్‌లో బాషలో క్రియేట్‌ చేసిన వాటిని కూడా మైక్రోసాప్ట్‌ ఈమైల్‌ని గుర్తిస్తోంది. కాబట్టి ఇది పెద్ద సమస్య కాదని చెబుతోంది మైక్రోసాప్ట్‌. ప్రభుత్వ సహకారం ఉంటే అతి త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మైక్రోసాప్ట్‌, రిడీఫ్ మాతృభాషలోకి మార్చడానికి ఒప్పుకున్నాయి. మిగతా వారు కూడా ప్రభుత్వ సహకారం ఉంటే తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించాయి. రిడీఫ్ సీఈఓ మాట్లాడుతూ... ఇది మంచి ఉద్దేశమే కానీ లోకల్‌లో ఉండే వారికి కేవలం 50 రూపాయలకే నెట్‌ సౌకర్యాన్ని ఇచ్చినట్లైతే ఎక్కువ మంది ప్రజలు దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉందని అప్పుడే మనం అనుకున్నది సాధించగలమని అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం స్వంత సర్వర్లను ఉపయోగిస్తున్నారు. ఈమైల్‌ సర్వీస్‌ ప్రోవైడర్లను కూడా ఇది వరకే ప్రభుత్వం తో ఈమేరకు రీజనల్‌ లాంగ్వేజ్‌ విషయంపై ఇప్పటికే చర్చించారని... ఇది గ్రౌండ్‌ వర్క్‌లో ఉందని తెలిసింది. 

 

జన రంజకమైన వార్తలు