• తాజా వార్తలు

అర్ణవ్ గోస్వామి రిపబ్లిక్ చానల్ ను తొలి వీఆర్ చానల్ గా ఆవిష్కరించనున్నాడా?

అర్ణవ్ గోస్వామి... ఇండియాలో వార్తల కోసం టీవీలు చూసే అందరికీ పరిచయమున్న ఫేమస్ జర్నలిస్ట్. ఆయన శైలి కాస్త వివాదాస్పదం అయినా ఆయన స్థాపించిన కొత్త ఛానల్ రిపబ్లిక్ టీవీ డిజిటల్ స్ర్రేటజీ మాత్రం చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఇప్పుడున్న స్మార్టు ఫోన్ కాలానికి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీస్ ను వాడుతోంది.
    ముఖ్యంగా ఇందులో పోర్ట్రెయిట్ వ్యూ అనేది కొత్తగా తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా స్మార్టు ఫోన్లు వాడే సమయంలో సుమారు 98 శాతం సమయం అవి నిలువుగానే ఉంటాయి. అందుకే ఈ వెర్టికల్ వ్యూకు తగ్గట్లుగా అర్ణవ్ ఛానల్ పోర్ర్రయిట్ వ్యూను ప్రవేశపెట్టింది.
    అంతేకాదు, 360 డిగ్రీల దృష్టికోణంలో వీడియోలు చూపేలా వర్చువల్ రియాలిటీ సెక్షన్ కూడా ఇందులో ఉంది.  త్వరలో వర్చువల్ రియాలిటీ లైవ్ కూడా అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే... అప్పుడు అర్ణవ్ షోలో ఉన్నా లేకున్నా వర్చువల్ రియాలిటీ ఆయన ప్రెజెన్స్ ఉంటుందన్నమాట.
    మరోవైపు టెక్నికల్ సపోర్టు కోసం ఈ చానల్ బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థను హైర్ చేసుకుంది. దాంతో పాటు ప్రతిష్ఠాత్మక మైక్రోసాఫ్ట్ తోనూ కొలాబరేషన్ ఉంది. అందుకే అర్ణవ్ సహా ప్రతి న్యూస్ ప్రజంటెర్ షో లోనూ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ టాప్ లే కనిపిస్తున్నాయి. మొత్తానికి వార్తా ఛానళ్లలో అర్ణబ్ కొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నారు.
 

జన రంజకమైన వార్తలు