అన్ బాక్స్ద్ హ్యాండ్ సెట్ లనూ మరియు రీ ఫర్బిష్డ్ ఫోన్ లను అమ్మడంలో ప్రముఖమైన సంస్థ ఓవర్ కార్ట్. ఈ కంపెనీ తమను తాము రీ కామర్స్ ప్లాట్ ఫాంగా పిలుచుకుంటుంది. వీటి అమ్మకాలలో భాగంగా రీ స్టోర్డ్ డివైస్ లు అనే ఒక కొత్త సెగ్మెంట్ ను ప్రారంభించింది. ఈ పరికరాలను ఎంత కొత్త గా వీలయితే అంత కొత్త గా అందించాలని లక్ష్యం గా ఈ కంపెనీ పెట్టుకున్నది. రీ స్టోర్డ్ డివైస్ లను జాగ్రత్తగా ఎంచుకుని వివిధ రకాల టెస్ట్ లను వాటిపై నిర్వహించి అనేక రకాల ప్రక్రియల ద్వారా వీటిని మరింత ఆకర్షణీయంగా వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకురానుంది.
దీని స్క్రీనింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
అన్ని రీ స్టోర్డ్ డివైస్ లపై ఈ ఓవర్ కార్ట్ కంపెనీ 5 స్టెప్ ల క్వాలిటీ స్క్రీనింగ్ ప్రక్రియ ను జరుపుతుంది. ఈ టెస్ట్ లు లేదా ప్రక్రియల వలన డివైస్ లన్నీ పూర్తీ స్థాయి పనితీరుతో పాటు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ సేల్ ద్వారా దాదాపుగా కొత్త ఫోన్ లను అన్ని అంశాలలోనూ పోలి ఉండే రీ స్టోర్డ్ పరికరాలను తక్కువ ధరలకే ఓవర్ కార్ట్ అందిస్తుంది. ఇక్కడ లభించే ఫోన్ లన్నీ 6 నెలల వారంటీ తో లభిస్తాయి. దేశవ్యాప్తంగా 60 సెంటర్ లలో ఇవి లభిస్తాయి. అంతేగాక 15 రోజుల రిటర్న్ పాలసీని కూడా ఇది కలిగిఉంటుంది.
మిగతా వాటికీ దీనికీ తేడా ఏమిటి?
ఓవర్ కార్ట్ కాకుండా ఇంకా అనేక రకాల ప్లాట్ ఫాంలు ఈ తరహా పరికరాలను అందిస్తున్నాయి అనే సంగతి మనందరికీ తెలిసినదే. అయితే వాటితో పోలిస్తే ఇది చాలా మెరుగైన సేవలను అందిస్తుంది. ఇంతకూ ముందు చెప్పినట్లు ఇక్కడ ఫోన్ కొంటె అది అచ్చం కొత్త ఫోన్ మాదిరిగానే ఉంటుంది. రీ ఫర్భిష్ద్ ఫోన్ ను కొన్న భావన ఏ మాత్రమూ కనిపించదు. అంతేగాక వారంటీ మరియు సర్వీస్ సెంటర్ల విషయం లోనూ మిగతా వాటికంటే ఇది మెరుగ్గా ఉంటుంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం నుండీ ఈ సేల్ ప్రారంభం అయింది. ఇందులో పాల్గొనాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
ఇక్కడ లభించే ఫోన్ ల ధరలు ఎలా ఉంటాయి?
ఫోన్ లు మాత్రమే కాక వాటి ధరలు కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. HTC డిజైర్ 816 యొక్క అసలు ధర రూ 24,999/- లు ఉండగా ఇక్కడ కేవలం రూ 7,499/- లు ఉంటుంది. సామ్సంగ్ ఫోన్ లు రూ 1,999/- ల నుండీ లభిస్తాయి. రూ 1290/- లు విలువచేసే ఇయర్ ఫోన్ లను కేవలం రూ 1/- కే పొందవచ్చు. కాకుంటే ఈ ఆఫర్ లిమిటెడ్ గా ఉంటుంది. మోటో x ప్లే రూ 6,999 లకే లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ 17,499 లు ఉంటుంది. ఇలా ఏ ఫోన్ తీసుకున్నా దాని ధరలో భారీ తగ్గింపులో ఒక్కోసారి ఊహించలేని తగ్గింపుతో ఇక్కడ లభిస్తాయి. కానీ ఇక్కడ ఫోన్ లు తీసుకునేటపుడు వాటి జీవిత కాలం అంటే లైఫ్ టైం ఎంత ఉందొ విచారణ చేసి తీసుకోవడం మంచిది.