• తాజా వార్తలు

సూపర్ మెమొరీతో ‘జియోనీ ఇలైఫ్ ఇ8’

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ జియోనీ తన -సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ కు పరిచయం చేస్తోంది. ‘ఇలైఫ్ 8' పేరుతో ప్రపంచానికి పరిచయమైన ఫోన్ శక్తివంతమైన 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఎన్ఎక్స్‌పీ స్మార్ట్ పీఏ ఆడియో చిప్, స్టీరియో స్పీకర్స్ విత్ డీటీఎస్ సపోర్ట్, ఫింగర్ - ఫ్రింట్ స్కానర్, జియోనీ వాలెట్ వంటి ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. అంతేకాదు... 24 ఎంపీ కెమేరాతో డీఎస్ ఎల్ ఆర్ లకు కూడా సవాల్ విసురుతోందిది. భారత కరెన్సీ ప్రకారం ఫోన్ విలువ రూ.41,148 ఉండొచ్చు. జూలై 15 నుంచి ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది.

    జియోనీ ఇలైఫ్ 8  ఫీచర్లు ఇవీ...

  • 6 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్)
  • 2గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్ 10 (ఎంటీ6795) ప్రాసెసర్
  • పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్
  • 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ
  • మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం
  • ఫోన్ థిక్ నెస్ 9.6 మిల్లీ మీటర్లు, బరువు 207 గ్రాములు
  • 24 మెగా పిక్సల్ వెనుక కెమెరా (డ్యుయల్ లోన్ ఎల్ఈడి ఫ్లాష్‌తో)
  • 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
  • ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, అమిగో 3.1 యూజర్ ఇంటర్‌‍ఫేస్
  • ఇంకా... ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, 2డీపీ, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ వంటి ప్రత్యేకతలతో ఇది అందరినీ ఆకర్షిస్తోంది.
  • ఇన్ని ప్రత్యేకతలున్నా చప్పున చల్లారిపోయే బ్యాటరీ ఉంటే లాభముండదు కాబట్టి  3520 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఆ విషయంలోనూ టాప్ లో ఉండే జాగ్రత్త పడ్డారు.

 

జన రంజకమైన వార్తలు