• తాజా వార్తలు

స్విస్ బ్యాంకు అకౌంటు వివరాలు ఎంత గోప్యమో ఈ ఈ-మెయిల్ వాడుతున్న వారి వివరాలు అంత గోప్యం!!

ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్ పెను సమస్యగా మారిన తరుణంలో ఈమెయిళ్లలో పంపే సమచారం భద్రత అనుమానమే. ముఖ్యంగా పెద్దపెద్ద వ్యాపార సంస్థలు... రక్షణ సంస్థలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ శాఖలు పంపించే, రిసీవ్ చేసుకునే ఈమెయిళ్లలో సమాచారాన్ని ఎవరూ తస్కరించలేరన్న ధీమా ఏమీ లేదు. గూగుల్, మైక్రోసాఫ్టు వంటి సంస్థలకే హ్యాకింగు ముప్పు ఉన్నప్పుడు వాటి  సహాయంతో ఉపయోగించుకుంటున్న ఈమెయిళ్లకు ఏం భద్రత ఉంటుంది?  అయితే...  మూడో కంటికి తెలియని  ఈమెయిల్ సర్వీసు కూడా ఒకటుంది. స్విట్జర్లాండ్ కు చెందిన ఈ సర్వీసును ఇప్పుడు చాలామంది నమ్ముతున్నారు.

స్విట్జర్లాండుకు చెందిన సాంకేతిక నిపుణులు జాసన్ స్టాక్, ఆండీయాన్, వెయ్సన్ అనేవారు ఈ కాన్ఫిడెన్షియల్ ఈ మెయిల్ సర్వీసు స్టార్టు చేశారు. దీని సర్వరు స్విట్టర్లాండులో ఉంటుంది.  ప్రోటాన్ మెయిల్ పేరుతో వీరు ప్రవేశపెడుతున్న మెయిల్ ను రిసీవర్, సెండర్ తప్ప వేరే ఎవరూ చూసే ఛాన్సుండదు. అంతేకాదు... ఇక్కడ ఇంకో సూత్రం కూడా ఉంది. స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంకులు దేనికి ప్రసిద్ధో తెలుసుకదా.. నల్లధనానికి అవి ప్రసిద్ధి. కారణం ఆ దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాలు బలంగా ఉండడంతో అక్కడ ఏ వివరాలూ బయటకు అందించారు. బ్యాంకుల్లో వివరాలు కూడా ఇవ్వరు. ఆ కారణంగానే బ్లాక్ మనీని అక్కడ దాచుకుంటారు. ఇప్పుడు ప్రోటన్ ఈ మెయిల్ లోనూ అదే కిటుకుంది. సర్వర్ స్విస్ లో ఉంటుంది కాబట్టి ఎవరైనా ప్రోటాన్ మెయిల్ యాజమాన్యాన్ని ఈమెయిళ్ల సమాచారం అడిగినా ఇవ్వడం సాధ్యం కాదు.

కాగా రెండేళ్ల కిందటే అందుబాటులోకి వచ్చిన ప్రోటాన్ ఈమెయిల్ ను ఇంకా బలోపేతం చేస్తున్నారు. దీని రెండు పాస్ వర్డులుంటాయి. అంతేకాకుండా... గోప్యత కోసం దీనికి ప్రత్యేక ఆప్షన్లుంటాయి. మెయిల్ ఆటోమేటిగ్గా డిలీట్ అయ్యేలా ముందే టైం సెట్ చయొచ్చు. హ్యాకర్లను ఎదుర్కోవడానికి ప్రతి అకౌంట్ పైనా 24 గంటల ఆన్ లైన్ వాచ్ ఉంటుంది.

అంతేకాదు.. ప్రోటాన్ మెయిల్ సర్వీసు నుంచి మన వ్యక్తిగత వివరాలేవీ బయటకు వెల్లడించరు. అసలు మెయిల్ ఖాతా తెరవడానికి మన వివరాలేవీ అడగరు.. కేవలం ఫోన్ నంబరు కానీ, వేరే మెయిల్ ఐడీ కానీ ఇస్తే చాలు. అది కూడా పాస్ వర్డ్ రికవరీకి అవసరం కాబట్టి తీసుకుంటారు.  ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత సురక్షితమైన మెయిల్ సర్వీసు ఇదే. మరి స్విస్ నుంచి ఆపరేటవుతోంది కాబట్టి బ్లాక్ మనీలా దీన్ని బ్లాక్ మెయిల్ అనాలేమో?

 

జన రంజకమైన వార్తలు