• తాజా వార్తలు

టైజెన్ 2.4 ఆపరేటింగ్ సిస్టం తో రానున్న సామ్ సంగ్ Z1

న్నాళ్ళూ స్మార్ట్ ఫోన్ లలో ఉండే ఆపరేటింగ్ సిస్టం  అంటే ఆండ్రాయిడ్ మరియు విండోస్ లేదా ios లే ఉండేవి. కాని ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మారుతుంది. మారుతున్నా ట్రెండ్ కు అనుగుణంగా సరికొత్త ఆపరేటింగ్ సిస్టం లు ఇపుడు స్మార్ట్ ఫోన్ లలో అలరించబోతున్నాయి. అలాంటి ఆపరేటింగ్ సిస్టం లలో ఒకటి టైజెన్ 2.4 . ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది సామ్సంగ్. ఈ ఆపరేటింగ్ సిస్టం కు సామ్ సంగ్ సాంకేతిక సహకారాన్ని అందించింది.

సామ్ సంగ్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లైన Z సిరీస్ ఫోన్ లలో టై జెన్ 2.4 ఓఎస్ ను అప్ డేట్ చేయనుంది.అదేంటో చూద్దాం.

సామ్ సంగ్ Z సిరీస్ స్మార్ట్ ఫోన్ లలో మొదటి దైన సామ్ సంగ్ Z1 లో టై జెన్ 2.4  ఓఎస్ ను ఇండియా లో ఉపయోగించనుంది. గత సంవత్సరం నుండీ ఈ ఓఎస్ బీటా టెస్టింగ్ ప్రోగ్రాం లో ఉన్నది. ఇది సరికొత్త ఫీచర్ లతో కలిసి 262 MB సైజ్ తో ఉన్నది. ఈ సరికొత్త ఓఎస్ లో కొన్ని కొత్త సేవలు అదనంగా చేర్చబడ్డాయి.అవి అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, పాస్ వార్డ్ ప్రొటెక్టెడ్ ప్రైవేట్ మెమోస్, వాట్స్ అప్ కాలింగ్, స్మార్ట్ మేనేజర్, కెమెరా, మ్యూజిక్ ప్లేయర్, వీడియో రికార్డర్ లాంటి పాత కొత్త అప్లికేషను లతో ఈ టై జెన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ యొక్క లాక్ స్క్రీన్ కూడా అప్ డేట్ చేయబడింది. కొత్త అప్ డేట్ ల కోసం యూసర్ లు సెట్టింగ్ ఆప్షన్ ల లోనికి వెళ్లి  About Device < Soft ware Update < Up date  ద్వారా అప్ డేట్ లను చెక్ చేసుకోవచ్చు.

ఒక వారం రోజుల్లూ ఈ టై జెన్ 2.4  బంగ్లాదేశ్, శ్రీలంక మరియు నేపాల్ దేశాలకు చేరనుంది.  గత నవంబర్ లో ఒక మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఈ టై జెన్ ఓ ఎస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. దాని ప్రకారం సామ్ సంగ్ యొక్క టై జెన్ అనేది 2015 మూడవ త్రైమాసికంలో ప్రపంచం లోనే నాలుగవ అతి పెద్ద ఆపరేటింగ్ సిస్టం గా నిలిచింది.ఈ క్రమంలో ఇది  ప్రముఖ బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టo ను వెనక్కు నెట్టడం విశేషం.

 

జన రంజకమైన వార్తలు