డీటీహెచ్ ప్రొవైడర్ టాటా స్కై చిన్నారుల కోసం ప్‌ూత్యేకంగా ఓ ఛానల్‌ను లాంచ్ చేయబోతోంది. టాటా స్కై కిడ్స్ సినిమా అని పేరు పెట్టిన ఈ ఛానల్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా చిన్నపిల్లల సినిమాలు టెలికాస్ట్ అవుతాయని టాటా స్కై ప్రకటించింది. యాడ్స్ లేకుండా ఈ మూవీస్ టెలికాస్ట్ కావడం మరో ప్రత్యేకత.
వరల్డ్‌వైడ్‌గా బోల్డన్ని సినిమాలు
చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా బోల్డన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇండియాలో ఇలాంటివి తక్కువే. కానీ యూఎస్, జర్మనీ, రష్యా, యుగోస్లేవియా వంటి దేశాల్లో చిల్డ్రన్స్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది. చిల్డ్రన్స్ మూవీ స్పెషలిస్ట్ మోనికా వాహీ అంతర్జాతీయంగా వివిధ భాషల నుంచి చిన్నారుల సినిమాలను సేకరించి ఫీచర్ చేయబోతుందని టాటా స్కై ప్రకటించింది.
టాటా స్కై సబ్‌స్క్రైబర్లకు ఫ్రీ
టాటా స్కై సబ్‌స్క్రైబర్లకు.. టాటా స్కై కిడ్స్ సినిమా ఛానల్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అవార్డులు గెలుచుకున్న 150 చిల్డ్రన్ సినిమాలతోపాటు యానిమేషన్ షోలు, షార్ట్‌ఫిల్మ్‌లను ఏడాది పొడవునా టెలికాస్ట్ చేయనుంది. ఇర్ఫాన్‌ఖాన్, అనిల్‌కపూర్, అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా ఫీచరింగ్‌తో ఉండే సినిమాలు కూడా ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, కన్నడ, జపనీస్, ఫ్రెంచి, జర్మన్, రష్యా తదితర భాషల నుంచి సినిమాలను టాటా స్కై ఈ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేస్తామని ప్‌జకటించింది. 24 గంటలపాటు ఈ ఛానల్ రన్ అవుతుంది. టాటా స్కై ఎస్‌డీ, హెచ్‌డీ, టాటా స్కై ఆన్ డిమాండ్ ఛానళ్లతోపాటు టాటా స్కై మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ సినిమాలను చూడొచ్చు. ప్రతి నెలా కొత్త సినిమాలను యాడ్ చేస్తారు.