• తాజా వార్తలు

ప్రపంచం లో అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ టెక్ 50 - బ్లాక్ బెర్రీ యొక్క కొత్త ఉత్పా

ప్రపంచం లో అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ టెక్ 50 - బ్లాక్ బెర్రీ యొక్క

కొత్త ఉత్పాదన        

ప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ ల ఉత్పత్తిదారు అయిన బ్లాక్ బెర్రీ నుండి ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన. తన సరికొత్త స్మార్ట్  ఫోన్ యొక్క ఇమేజ్ ను లీక్  చేయడం ద్వారా ఆ ఆశ్చర్యానికి తెరతీసింది బ్లాక్ బెర్రీ. DTEK50 ఇది ఆ స్మార్ట్ ఫోన్ పేరు. ఈ సంర్ట్ ఫోన్ యొక్క లాంచ్ ను అధికారికంగా బ్లాక్ బెర్రీ ప్రకటించింది. ఏది ఏమైనప్పటికీ బ్లాక్ బెర్రీ తన సొంత హార్డ్ వేర్ నుండి దూరంగా జరిగి ఆల్కా టెల్ ఐడల్ 4 యొక్క హార్డ్ వేర్ స్పెసిఫికేషన్ లను ఈ DTEK50 లో వాడినట్లు తెలుస్తుంది. అంతేగాక ప్రపంచం లో ని స్మార్ట్ ఫోన్ లన్నింటి కంటే అత్యుత్తమ సెక్యూరిటీ ప్రమాణాలతో దీనిని తీసుకురానునట్లు కూడా తెలిసింది.

ఈ ఫోన్ విశిష్టతలు:

  1. పేరు                        DTEK50
  2. డిస్ ప్లే                     5.2 అంగుళాల ఫుల్ HD
  3. ప్రాసెసర్                   క్వాల్ కాం యొక్క స్నాప్ డ్రాగన్ 617 ఆక్టా కోర్ ప్రాసెసర్
  4. RAM                       3 GB
  5. స్టోరేజ్                     16 GB ఇంటర్ నల్, ఎక్స్ ప్యాండబుల్ టు 2TB
  6. గ్రాఫిక్స్                    అడ్రినో 405
  7. కెమెరా                    13 MP రేర్ f/2.0 లెన్స్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ PDAF
  8. ఫ్రంట్ కెమెరా            8 MP f/2.284 LED ఫ్లాష్
  9. ఆపరేటింగ్ సిస్టం       ఆండ్రాయిడ్ మార్ష్ మాల్లో
  10. బ్యాటరీ                    2610 mAh బ్యాటరీ
  11. సిమ్                       4 జి LTE
  12. వైఫై                         802.11 ac( 2.4 GHz & 5 GHz)
  13. బ్లూ టూత్                4.2 మరియు NFC
  14. ధర                         299 డాలర్ లు  ( రూ 20,000/- సుమారుగా )

 

జన రంజకమైన వార్తలు