• తాజా వార్తలు

ఇంటి భద్రతకు టెక్నాలజీని వాడుకోవచ్చు ఇలా..

టెక్నాలజీ మన జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేస్తోంది. స్మార్టు ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లనే మనం నిత్యం గాడ్జెట్లుగా పిలుస్తున్నాం కానీ, ఇంకా ఎన్నో టెక్ పరికరాలను మన నిత్య జీవితంలో వాడుతున్నాం.  ముఖ్యంగా మనకు నిత్యం భద్రత కల్పించే హోం సెక్యూరిటీ వ్యవస్థల్లో వస్తున్న అధునాతన టెక్నాలజీస్ కూడా ఇలాంటివే. ప్రస్తుతం మార్కెట్లో బాగా ఆదరణ పొందుతున్న కొన్ని హై ఎండ్ సెక్యూరిటీ వ్యవస్థలను చూద్దాం.

స్మైలీ ఫేస్‌ హిడెన్‌ కెమేరా..
ఇది ఆటో పవర్‌ అండ్‌ సేవ్‌ రికార్డింగ్‌ కెమేరా.  గృహాలు, ట్రేడ్‌ షోస్‌ ,స్కూళ్లు ఇలా ప్రతి చోటా దీన్ని అమర్చుకోవచ్చు.  స్మైలీ ఫేస్‌తో దృశ్యాలను బంధించడం దీని ప్రత్యేకత. ఎవరూ దీనిని కెమేరాగా పోల్చుకోలేరు. ధర:1899.

ఎల్‌ఇడి బల్బ్‌ స్పై కెమేరా 
వైర్‌ లెస్‌ 360 డిగ్రీల ఐపి కెమేరా, ఫిష్‌ ఐ విజన్‌ దీని ప్రత్యేకతలు. ఇళ్లు, ఆఫీసులు, సంస్థలు ఇలా ప్రతి చోటా వీటిని వినియోగించుకోవచ్చు. బల్బ్‌ తరహాలో వెలుగుతూ రాత్రివేల దృశ్యాలు రికార్డ్‌ చేయడం దీని స్పెషాలిటీ. మొబైల్‌తోనూ దీన్ని ఆపరేట్‌ చేయవచ్చు. అంతేకాదు... మనం ఎక్కడున్నా కూడా దీన్ని అమర్చిన లొకేషన్లో ఏం జరుగుతుందో మొబైల్ లో చూసుకోవచ్చు. ధర: 5999

సిసి కెమేరాలు
ప్రత్యేకించి ఇళ్లకు సరిపోయే సెక్యూరిటీ వ్యవస్థ ఇది.  స్మార్ట్‌ ఫోన్‌ ఆదారంగా పని చేసే సిసి కెమేరాలు ఇవి. రాత్రి సమయాల్లో ఎవరైనా వస్తే మనం ఫోన్లో చూసి పసిగట్టేయొచ్చు. దీని ధర ధర రూ. 1200.

కెవో కీ స్మార్ట్‌లాక్‌ 
ఇది ఒక ఎలక్ట్రానిక్‌ కీ. స్మార్ట్‌ ఫోన్‌ ఆధారంగా పని చేసే స్మార్ట్‌ లాక్‌. మనతో పాటు కుటుంబ సభ్యులకు... మనం ఆమోదించే ఇతరులుక దీని యాక్సెస్ ఇవ్వొచ్చు. ధర కాస్త ఎక్కువే. రూ. 12,855 ఉంది.
 

జన రంజకమైన వార్తలు