గత రెండు సంవత్సరాల నుండీ ప్రపంచం ఒక పూర్తి స్థాయి డిజిటలైజేషన్ కో లోనయి ఆ దిశగా వేగంగా మార్పు చెందుతుంది. సమావేశాల దగ్గరనుండీ స్కూల్ లలో చెప్పే పాఠాల వరకూ ప్రతీదీ డిజిటలైజ్ అయింది. దీనికంతటికీ ఒకే ఒక్క కారణం ఇంటర్ నెట్. అవును ఇంటర్ నెట్ యొక్క విస్తృతి మారుమూల ప్రాంతాలకు కూడా చేరడమే గాకా అదిఉ లభించే స్పీడ్ కూడా గణనీయంగా పెరగడం తో ఇదంతా సాధ్యమైంది అని చెప్పడం లో సందేహం కెదు. ప్రత్యేకించి మొబైల్ నెట్ వర్క్ ల విషయానికొస్తే 3 జి సేవలు అందుబాటులో వచ్చాక ఇంటర్ నెట్ యొక్క స్వరూపమే మారిపోయింది. అత్యంత వేగావంతమైన ఇంటర్ నెట్ సౌకర్యాన్ని 3 జి అందించింది. ఇక 4 జి రాకతో ఏ ఇంటర్ నెట్ స్పీడ్ విషయం లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.
మనం చెప్పుకునట్లు ఈ ఇంటర్ నెట్ యుగం లో ఎక్కువగా ప్రభావితం చెందిన రంగం టెలి కమ్యూనికేషన్స్. ఈ రోజు వరకూ అనేక కంపెనీ లు ఈ టెలికాం మార్కెట్ లో ఒకదానిపై ఒకటి పై చేయి సాధించడానికి పోటీ పడుతూ ఉన్నాయి. వినియోగదారునికి ఏం కావాలి అనే అంశం పై దాదాపు ఈ కంపెనీలన్నింటికీ ఒక స్పష్టత ఉంది. అందువల్లనే ఇవి సరికొత్త టెక్నాలజీ లతోనూ మరియు కళ్ళు చెదిరే ఆఫర్ లతోనూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
గత మూడు సంవత్సరాల నుండీ సెల్యూలర్ డేటా అనేది అత్యధికంగా అభివృద్ది చెందిoది. 3 జి మరియు 4 జి లాంటి అధునాతన టెక్నాలజీ ల సహాయo తో ఇవి అందిస్తున్న వైర్ లెస్ ఇంటర్ నెట్ అనేది మానవ జీవన విధానాలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మొబైల్ డేటా ను ఏకచత్రాదిపత్యంగా ఏలు తున్నది మాత్రమే 4 జి నే.
4 జి సెల్యూలర్ నెట్ వర్క్ యొక్క విశిష్టత లు ఏమిటి?
4 జి డేటా అనేది 3 జి డేటా కంటే 30 శాతం ఎక్కువ స్పీడ్ ను అందిస్తుంది. 2 జి మరియు 3 జి నెట్ వర్క్ లలో వీడియో లు చూసేటపుడు అవి మధ్య లో ఆగిపోవడం లేదా బఫరింగ్ అవడం, పెద్ద పెద్ద ఫైల్ లను డౌన్ లోడ్ చేసేటపుడు ఇబ్బంది పెట్టడం మనందరికీ అనుభవమే.కానీ ఇలాంటి సమస్యలన్నింటినీ 4 జి పరిష్కరించింది. పైన చెప్పుకున్నట్లు ఇది అన్ని ip లకూ బ్రాడ్ బ్యాండ్ ను పోలిన ఇంటర్ నెట్ స్పీడ్ ను అందిస్తుంది. అంతేకాదు యూజర్ ల సంఖ్య పెరిగేకొద్దీ డేటా స్పీడ్ తగ్గడం లాంటి అంశాలేవీ ఇందులో ఉండవు, ఎంతమంది యూజర్ లు అయినా అపరిమిత డేటా ఆనందాన్ని పొందవచ్చు.
ఇది మాత్రమే గాక మేరు ఇంటర్ నెట్ వాడేటపుడు హ్యాకింగ్ కు గురి అవకుండా మిమ్మల్ని కాపాడుతుంది. సాధారణంగా పబ్లిక్ వైఫై లను వాడేటపుడు మీ డేటా హ్యాకింగ్ కు గురవుతూ ఉంటుంది. అంటే వైఫై నెట్ వర్క్ లతో పోలిస్తే ఈ 4 జి అనేది అత్యంత సురక్షితమైనది గా చెప్పుకోవచ్చు.
దాదాపు అన్ని మేజర్ టెలికాం ఆపరేటర్ లూ ఇండియా లో 4 జి డేటా ను అందిస్తున్నాయి. వివిధ రకాల ప్లాన్ లలో ఇవి తమ ఆఫర్ లను అందిస్తున్నాయి.అయితే వీటిలో బెస్ట్ ఏది? ఏది వాడడం ద్వారా మనం ఎక్కువ డేటా ను పొందవచ్చు ? తదితర అంశాలను ఏ వ్యాసం లో చూద్దాం.
ఎయిర్ టెల్ :-
ఎయిర్ టెల్ 4 జి యొక్క ప్లాన్ లకు ఉత్తర భారత దేశానికీ మరియు దక్షిణ భారత దేశం లోని ప్లాన్ లకూ కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఉత్తర భారత దేశం లో ఎయిర్ టెల్ 1 GB ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ లో రూ 255/- లకూ మరియు 10 GB ప్లాన్ 28 రోజులకు రూ 1998/- లకు లభిస్తుంది. అదే దక్షిణ భారత దేశం లో అయితే 500 MB ప్లాన్ 28 రోజులకు రూ 145/- లలో ఉంటే 10 GB ప్లాన్ 28 రోజులకు రూ 1347/- లకు లభిస్తుంది.
వోడాఫోన్:-
వోడాఫోన్ కూడా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్ లను ప్రకటించింది. ఇది 1 GB ప్లాన్ ను రూ 256/- లకు అందిస్తూ ఉండగా 10 GB డేటా ను రూ 999/- లకు అందిస్తుంది.
ఐడియా :-
ఐడియా లో 1 GB డేటా ప్యాక్ రూ 249/- ఉండగా 10 GB డేటా ప్యాక్ యొక ధర రూ 995/- గా ఉన్నది. వ్యాలిడిటీ 28 రోజులుగా ఉన్నది.
రిలయన్స్ జియో :-
జియో గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇండియన్ టెలికాం రంగాన్ని ఒక ఊపు ఊపిన జియో మార్చ్ వరకూ తన అపరిమిత ఉచిత సేవలను కొనసాగించనుంది. ఆ తర్వాత నుండీ కూడా అతి తక్కువ ధరలకే 4 జి డేటా ను అందించనుంది. రూ 149/- ల ప్యాక్ లో 300 MB 4 జి డేటా తో పాటు అపరిమిత ఉచిత కాల్ లు లభిస్తాయి. రూ 299/- ల ప్యాక్ తో 10 GB డేటా తో పాటు అనేక డిజిటల్ ఆఫర్ లు లభిస్తాయి.