మే నెలలో బోలెడు గ్యాడ్జెట్లు రిలీజయ్యాయి. హెడ్‌ఫోన్స్ నుంచి సెల్‌ఫోన్ల వరకు, ల్యాప్‌టాప్‌ల నుంచి డీఎస్ఎల్ఆర్‌ల వరకు ఇలా 23 గ్యాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి వివరాలు క్లుప్తంగా మీకోసం..
1. యాపిల్ వాచ్ 3 సెల్యులర్
యాపిల్ వాచ్ సెల్యులర్ వెర్షన్ ఇండియాలో రిలీజ్ చేస్తుంది. కాల్స్ చేసుకోవడం, మ్యూజిక్ వినడం, ఫిట్‌నెస్ ట్రాకర్‌గా వినియోగించుకోవడం, స్మార్ట్ డివైస్‌గా వాడుకోవడం ఇలా చాలా పనులు చేసిపెట్టే ఈ వాచ్ ఖరీదు 39,080 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.
2.వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్
చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన లేటెస్ట్ మోడల్ వన్‌ప్లస్ 6ను మే నెలలోనే రిలీజ్ చేసింది. లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లన్నీ బాగున్నాయంటున్నాయి మార్కెట్ వర్గాలుజ 6జీబీ / 8జీబీ ర్యామ్ వేరియంట్లతో రిలీజయింది. 34,999 రూపాయల నుంచి ధర మొదలవుతోంది. అమెజాన్ వెబ్‌సైట్‌లో దొరుకుతుంది.
3. హానర్ 10 (Honor 10)
హువావే సబ్‌బ్రాండ్ హానర్ నుంచి వచ్చిన ఈ హానర్ 10 స్మార్ట్‌ఫోన్.. వన్‌ప్లస్ 6కు పోటీదారు. 64వేల రూపాయల ఖరీదుతో వచ్చిన హువావే పీ20 ప్రోలో ఉన్న ప్రాసెసర్‌ను, డ్యూయల్ రియర్ కెమెరాలను ఈ ఫోన్‌లో కూడా వాడడం విశేషం. ధర 32,999.
4. ఫ్యుజీ ఫిల్మ్ జీఎఫ్ఎక్స్ 50ఎస్ కెమరా (Fujifilm GFX 50S)
ఫ్యుజీ ఫిల్మ్ జీఎఫ్ ఎక్స్ 50ఎస్ కెమెరా ఇండియాలోని మిర్రర్ లెస్ కెమెరాల్లో అత్యంత ఖరీదైనది. 51.4 మెగాపిక్సెల్ సీఎంఓఎస్ సెన్సర్, 2.36 ఎండాట్ టచ్ స్క్రీన్ ఎల్ఈడీ బ్యాక్‌ప్యానల్‌తో వచ్చిన ఈ కెమెరా ఖరీదు 5 లక్షల 12వేల రూపాయలు.
5. షెన్‌హైజర్ మొమెంటమ్ ఫ్రీ ఇన్ ఇయర్ ఫోన్స్ (Sennheiser Momentum Free in-ear headphones)
ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ నుంచి వచ్చిన ఈ ఇయర్ ఫోన్ బ్లూటూత్ 4.2తో కనెక్టివిటీ కలిగి ఉంది. త్రీబటన్ రిమోట్, కాల్స్ చేసుకోవడానికి మైక్‌లాంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఇయర్ ఫోన్స్ ఖరీదు 14,990 రూపాయలు.
6. ఆసుస్ ఆర్వోజీ జీ703 గేమింగ్ లాప్‌టాప్ (Asus ROG G703 )
ఆసుస్ ఆర్వోజీ జీ703 పేరిట తీసుకొచ్చిన గేమింగ్ ల్యాప్టాప్ మే నెలలో విడుదలైన గ్యాడ్జెట్స్‌లో ఖరీదైనవాటిలో ఒకటి. 17.3 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఎనిమిదో జనరేషన్ ఇంటెల్ కోర్ i9-8950HK ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 2టీబీ ఇంటర్నల్ స్టోరేజీ వంటి సూపర్ ఫీచర్లున్నాయి. బేసిక్ మోడల్ ధరే 4,99,990 రూపాయలు.
ఇంకా ఇవి కూడా..
శాంసంగ్ గెలాక్సీ జే6, శాంసంగ్ గెలాక్సీ జే8, శాంసంగ్ గెలాక్సీ ఏ6, శాంసంగ్ గెలాక్సీ ఏ6 ప్లస్, ఓపో రియల్‌మీ1, హానర్ 7ఏ, హానర్ 7సీ, మైక్రోమ్యాక్స్ భారత్ గో, కూల్‌ప్యాడ్ నోట్ 6, పానాసోనిక్ పీ95, వివో ఎక్స్ 21స్మార్ట్‌ఫోన్లు, వన్‌ప్లస్ బుల్లెట్ ఇయర్ ఫోన్లు, గో ప్రో ఫ్యూజన్ 360 డిగ్రీ కెమెరా, జేబీఎల్ గో2 బ్లూటూత్ స్పీకర్లు, ఫిట్‌బిట్ వెర్సా స్మార్ట్ వాచ్, సోనీ ఎంహెచ్‌సీ వీ81డీ ఆడియో సిస్టమ్, సోనీ బ్రేవియా ఎక్స్9000 ఎఫ్ 4కే హెచ్‌డీఆర్ ఆండ్రాయిడ్ టీవీ కూడా మే నెలలో రిలీజయ్యాయి.