నోట్ 7 ఫోన్లతో అపఖ్యాతి మూటగట్టుకున్న శాంసంగ్ ఎట్టకేలకు ఆ ఫోన్లలోని బ్యాటరీలు ఎందుకు పేలిపోతున్నాయో కనుగొంది. నోట్ 7 వైఫల్యాలకు గల కారణాలను పూర్తిగా వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొన్న శాంసంగ్ ఆ మోడల్ పోన్లు పేలిపోవడానికి మాత్రం అందులోని బ్యాటరీయే కారణమని తేల్చింది. శాంసంగ్ సంస్థ నిర్వహించిన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో ఈ విషయం బయటపడిందట. ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును ఈ నెల 23న విడుదల చేయనున్నారు.
నిజానికి స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో రారాజుగా ఉన్న శాంసంగ్ సంస్థ నోట్ 7 తో మాత్రం పరువు పోగొట్టుకుంది. యాపిల్‌కు ధీటుగా మార్కెట్‌లో తన సత్తా చాటిన శ్యామ్‌సంగ్ నోట్ 7 విషయంతో మాత్రం వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనలేకపోయింది. 2016లో అతిపెద్ద టెక్ ఫెయిల్యూర్ అయిన నోట్ 7 దెబ్బకు శాంసంగ్ విలవిలలాడింది. అయితే.. తాజాగా ఎస్ 8 ను రిలీజ్ చేస్తున్న క్రమంలో తమను వెంటాడుతున్న ఎస్ 7 లోపాల నుంచి బయటపడడం కోసం ఈ రిపోర్టును రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఎస్ 7 వైఫల్యాలకు గల కారణాలను పూర్తిగా వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొన్న ఆ సంస్థ పోన్లు పేలిపోవడానికి మాత్రం అందులోని బ్యాటరీయే కారణమని తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత విచారణలోనే ఈ విషయం బయటపడినట్లు తెలిపింది. ఇదంతా ఎస్ 8 మార్కెట్ కు నోట్ 7 వైఫల్యాలు ఆటంకం కాకుండా ఉండేందుకేనని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. నోట్ 7 వైఫల్యాలు పునరావృతం కాకుండా చూస్తున్నామన్న నమ్మకం కలిగించడం కోసం ఈ రిపోర్టును రిలీజ్ చేస్తున్నారంటున్నారు.