• తాజా వార్తలు

అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణ ఈ రోజే

రింగింగ్‌బెల్స్‌ వారి 'ఫ్రీడమ్‌ 251' మోడల్

దేశీయ హ్యాండ్‌సెట్‌ ఉత్పత్తిదారు రింగింగ్‌బెల్స్‌ భారతలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ వారంలో 500 రూపాయల లోపు ధరకే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా ఈ ఫోన్‌ను విడుదల చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 17న 'ఫ్రీడమ్‌ 251' ఫోన్‌ను రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్ విడుదల చేస్తారు.
ప్రస్తుతం దేశంలో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ల కనీస ధర 2,500 రూపాయలు. 999 రూపాయలకే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానున్నట్లు గతేడాది డేటావిండ్‌ ప్రకటించింది. అయితే ఇంతవరకు ఈ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. రింగింగ్‌బెల్స్‌ విదేశాల నుంచి విడిభాగాలు దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్‌ చేసి విక్రయిస్తోంది. త్వరలో దేశంలో ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇటీవలే భారతలో అత్యంత చౌకైన 4జి స్మార్ట్‌ఫోన్‌ (ధర రూ. 2,999)ను ఈ కంపెనీ విడుదల చేసింది.

రింగింగ్ బెల్స్ చేసిన రూ.500 స్మార్ట్ ఫోన్ ప్రకటన ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ల యాక్సెసరీస్ లో ఎక్కువగా అమ్ముడుపోయే బ్యాక్ కవర్ ధర కూడా రూ.500 ఉంటోంది. అలాంటిది రూ.500 కు ఏకంగా స్మార్ట్ ఫోన్ వస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫీచర్ ఫోన్లు కూడాఎంత చిన్న కంపెనీ అయినా కూడా రూ.500కి తక్కువ కు విక్రయించడం లేదు. ఈ నేపథ్యంలో రింగింగ్ బెల్స్ అంత తక్కువ ధరకు ఫోన్ ఎలా అందివ్వగలుగుతుంది.... అందులో ఏమేం ఆప్ఫన్లు ఉంటాయి. కేవలం టచ్ స్క్రీన్ పెట్టి... ఆండ్రాయిడ్ పాత వెర్షన్లతో దీన్ని మార్కెట్ చేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో కనీసం ఆండ్రాయిడ్ కిట్ కేట్ వెర్షన్... 1జీబీ ర్యాం, 4జీబీ ఇంటర్నల్ మెమరీ.. 5 ఎంపీ రియర్ కెమేరా, 2 ఎంపీ సెల్ఫీ కెమేరా, కనీసం 4.5 అంగుళాల డిస్ ప్లే, జీపీఎస్, వైఫై ఉంటేనే స్మార్ట్ ఫోన్ గా పరిగణిస్తున్నారు. ఇలాంటి సదుపాయాలుంటే కనీసం రూ.3,500 వేల ధర ఉంటుంది. మరి రింగింగ్ బెల్స్ రూ.500 కి ఇచ్చే ఫోన్ లో ఇన్ని ఫీచర్లు ఉంటాయో లేదో చూడాలి.

 

జన రంజకమైన వార్తలు