తొలి స్నూపర్ ప్రొటెక్షన్ లాప్ టాప్ - HP ఎలైట్ మీరు మీ లాప్ టాప్ ఉపయోగించేటపుడు ఒక్కో సారి మీ వెనక్కి చూసుకున్నారా? ఎందుకంటే మీ వెనకనుండి కొంత మంది తొంగి చూస్తూ మీరు లాప్ టాప్ లో చూస్తున్న డేటా అంతటినీ మీ కార్యకలాపాలనూ చూసే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇలాంటి పరిస్థితి ఫ్లైట్ లో ప్రయాణం చేసేటపుడు వస్తుంది. సాధారణంగా జర్నలిస్ట్ లు ఇలా చేస్తారు అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే ఈ మెయిల్ లు ఓపెన్ చేయడానికి, సెన్సిటివ్ డాక్యుమెంట్ లను చదవడానికి ఏరో ప్లేన్ లు సేఫ్ ప్రదేశాలు అని చాలా మంది నమ్మకం. ఇక్కడ కూడా స్నూపింగ్ ద్వారా మీ లాప్ టాప్ లో ఉండే సమాచారం వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇలాంటి వారికోసమే HP స్నూపర్ ప్రొటెక్షన్ లాప్ టాప్ లను ప్రవేశ పెట్టింది. ప్రముఖ లాప్ టాప్ ల తయారీ సంస్థ అయిన HP తాజాగా ఎలైట్ 1040 మరియు 840 అనే రెండు మోడల్ లాప్ టాప్ లను ప్రవేశ పెట్టింది. ఈ లాప్ టాప్ లు ఒక ప్రత్యేక కోణం లోనుండి చూసినపుడు మాత్రమే కనిపిస్తాయి. మనం వీటిని చూసే కోణం మారితే స్క్రీన్ యొక్క విజిబిలిటీ 95 శాతం వరకూ తగ్గుతుంది. 3M ప్రైవసీ టెక్నాలజీ తో ఇవి రూపొందించబడ్డాయి. ఈ టెక్నాలజీ వలన మనం లాప్ టాప్ ను వాడేటపుడు రక్షణ కోసం వేరే పరికరాలను తీసుకు వెళ్ళే అవసరం ఉండదు. దీన్ని ఉపయోగిచడం చాలా తేలిక. మనం మామూలు గా చూడాలంటే చూడవచ్చు. లేదా ప్రైవసీ మోడ్ లో మన లాప్ టాప్ ను ఉంచాలంటే F2 కీ ని ప్రెస్ చేస్తే చాలు. ఇది ఆటోమాటిక్ గా ప్రైవసీ మోడ్ లోనికి వెళ్లి ఒక కోణం నుండి మాత్రమే స్పష్టం గా కనిపిస్తుంది. ఏ మాత్రం మనం చూసే కోణం మారినా దాని విజిబిలిటీ 95 శాతం తగ్గుతుంది. విజువల్ హ్యాకింగ్ అనేది ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో మన డేటా భద్రత కు ఈ HP ఎలైట్ స్నూపర్ ప్రొటెక్షన్ లాప్ టాప్ లు ఎంతగానో ఉపయోగపడతాయి అనడం లో ఏం సందేహం లేదు. |
"