• తాజా వార్తలు

3D గ్లాసెస్ లేకుండా 3D సినిమాలు చూపే కొత్త టెక్నాలజి

3D గ్లాసెస్ లేకుండా 3D సినిమాలు చూపే కొత్త టెక్నాలజి

సినిమా లు బాగా చూసే వారికి ఒక శుభవార్త. ధియేటర్ లో 3D సినిమా ఆడుతుంటే మనం ఎలా చూస్తాం? ప్రతీ ప్రేక్షకునికి కళ్ళద్దాలు ఇస్తారు. ఆ కళ్ళద్దాల లోనుండి చూసినపుడు మాత్రమే మనం 3D సినిమా చూసిన అనుభూతిని పొందుతాము. ఆ కళ్ళద్దాలు లేకపోతే మామూలు సినిమా కు, 3D సినిమా కు తేడా ఉండదు. ఇకపై 3D సినిమా చూడాలంటే కళ్ళద్దాలు పెట్టుకోవలసిన అవసరం లేదు అంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కి చెందిన పరిశోధకులు. ధియేటర్ లో కూర్చున్న వారందరూ ఎటువంటి కళ్ళద్దాల అవసరం లేకుండానే 3D అనుభూతిని పొందేలా డబ్   సినిమా 3D అనే technology  ని రూపొందించి నట్లు వారు చెబుతున్నారు. సినిమా తెర ముందు ఒక ప్రోటో టైపు లెన్స్ లూ, మిర్రర్ లతో కూడిన అమరిక ఒకటి దీనిలో ఉంటుంది.

గ్లాస్ లు లేని 3D అనుభూతిని పొందాలంటే అది ప్రాక్టికల్ గా సాధ్యo కాదు, కానీ దానిని సాధించేందుకు కృషి చేస్తున్నాం అని ప్రొఫెసర్ మస్తుక్ చెప్పారు. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ  ప్రయోగ దశలో మాత్రమే ఉంది. ఇంకా మార్కెట్ లోనికి రాలేదు. దానికి కొంతసమయం  పట్టవచ్చు. దీనికి ధియేటర్ లు కూడా సహకరించ వలసిన అవసరం ఉంది. భవిష్యత్ లో అది జరుగవచ్చని ఆశిద్దాం అని వీరు చెబుతున్నారు.

కళ్ళద్దాలు లేని 3D అనేది కొత్త టెక్నాలజీ ఏమీ కాదు. టీవీ సెట్ ల ముందు ఒక ప్రత్యెక మైన అమరిక ను ఉంచడం ద్వారా 3డి సినిమాలను కళ్ళద్దాలు లేకుండానే వీక్షించే టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీనికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. దీనిని ఉపయోగించి టీవీ చూసేటపుడు నిర్దిష్ట దూరం లోనూ, కోణం లోనూ ఉండి చూడాలి. కానీ  ధియేటర్ లు అంటే అది పెద్ద మొత్తం లో విశాలమైన స్థలం లో  కావాలి కదా అందుకనే ఇంతవరకూ అ దిశగా ఏదీ అందుబాటులో లేదు. కొన్ని కొన్ని చిన్న టెక్నాలజీ లు ఉన్నప్పటికీ అవి సరైన నాణ్యతను ఇవ్వలేవు. కానీ వీరు కనుగొంటున్న టెక్నాలజీ మాత్రం ఆ సమస్యలన్నిటినీ అధిగమించేలా ఉంటుందని వీరు చెబుతున్నారు, కాబట్టి ఆ టెక్నాలజీ అతి త్వరలోనే రావాలని కోరుకుందాం.

 

జన రంజకమైన వార్తలు