మన వెళ్లిన ప్రతి చోటకి కంప్యూటర్‌ని తీసుకెళ్లడం సాధ్యం కాదు.. ఒకవేళ తీసుకెళ్లినా అన్ని వేళలా వెంట ఉంచుకోవడం కూడా కుదరదు. ఐతే మనం ధరించిన దుస్తులే కంప్యూటర్లు అయితే! మన ఎక్కడికి వెళ్లినా మనతోనే వస్తూ మన అవసరాలు తీరిస్తే! ఈ ఆలోచనే అద్భుతంగా ఉంది కదా! ఇప్పుడు ఆ ఆలోచనే వాస్తవంలోకి రాబోతోంది! త్వరలో దుస్తుల్లో దాచే కంప్యూటర్లు రాబోతున్నాయ్! మన దుస్తులు కంప్యూటర్లకే కాదు ట్యాబ్లెట్లు, స్మార్టుఫోను పని చేసేలా ఉపయోగిస్తే సూపర్ ఉంటుంది కదా! ఈ దిశగానే పరిశోధనలు వేగవంతం అయ్యాయి. ధరించే ఎలక్ట్రానిక్ వస్తువులను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుస్తుల తయారీ సమయంలోనే ఈ ఎలక్ర్టానిక్ వస్తువులను అమర్చి పని చేసే విధంగా రూపొందించడానికి ప్రయోగాలు చేస్తున్నారు. దుస్తుల తయారీలో ఇదో విప్లవంగా భావిస్తున్నారు. దుస్తుల్లో సెన్సార్లు, కంప్యూటర్ మెమొరీ డివైజ్‌లు ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని చేరవేసేలా తయారు చేయాలని ఓహియో సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే క్రీడల్లో ఇలాంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ స్విమ్ సూట్ల ద్వారా స్విమింగ్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ఇప్పడు అథ్లెట్ల కోసం కూడా ప్రత్యేకమైన ఎలక్ర్టానిక్ దుస్తులు తయారవుతున్నాయి. అథ్లెట్లు పరుగెత్తేటప్పడు వాళ్ల శరీర కదలికలు ఎలా ఉన్నాయి.. అంతర్గతంగా అవయువాలు ఎలా స్పందిస్తున్నాయ్ లాంటి విషయాలు ఈ ప్రత్యేక దుస్తుల ద్వారా తెలుసుకోవచ్చు. వోలకీ సంస్థ ఎలక్ర్టానిక్ దుస్తుల తయారీ కోసం ఒక టేబుల్‌టాప్ స్వియింగ్ మిషన్‌ను తయారు చేసింది. దీనిలో ముందుగానే రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా భిన్న రకాల ఎంబ్రాయిడరీ డిజైన్లను ఈ స్వియింగ్ మినన్ వేస్తుంది. దీనిలో వాడే దారానికి బదులు నాణ్యమైన సిల్వర్ మెటల్ వైర్లను ఉపయోగిస్తున్నారు. దుస్తుల్లో యాంటినాలు, ఎలక్ర్టానిక్ పరికరాలు ఉంచడానికి ఇలాంటి మిషన్లను వాడుతున్నారు. |