• తాజా వార్తలు

రెడ్ మీ నుంచి స్మార్ట్ షూస్

చైనీస్ మొబైల్ దిగ్గజం రెడ్‌మీ త‌న వ్యాపార విస్తృతిని పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే సెల్‌ఫోన్లు, టాబ్లెట్ల తో దుమ్ము రేపిన రెడ్‌మీ ఫిట్‌నెస్ గేర్ అమ్మకాల‌పైనా దృష్టి పెట్టింది. స్మార్ట్ వాచ్‌, ఫిటెనెస్ హ్యాండ్ బ్యాండ్‌ల‌ను విక్రయిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు స్మార్ట్ షూస్‌ను మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయ‌బోతోంది. దీనికి 90 మినిట్స్ ఆల్ట్రా స్మార్ట్ ర‌న్నింగ్ షూస్ అని పేరు పెట్టింది.
 ప్రత్యేక‌త‌లేంటి?
 రూమ్నీ టెక్నాల‌జీతో ఈ స్మార్ట్ షూస్‌ను త‌యారుచేశారు. దీనిలో ఇంటెల్ క్యూరీ చిప్ ఉంటుంది.  ఈ షూస్ వేసుకుని ర‌న్నింగ్ చేస్తే ఎంత దూరం ప‌రిగెత్తారు, లేదా న‌డిచారు?  ఎంత వేగంతో వ‌ర్కవుట్ చేశారు? ఎన్ని క్యాల‌రీలు ఖ‌ర్చయ్యాయి? వ‌ంటి ఇన్ఫర్మేష‌న్‌ను ఈ చిప్ రికార్డ్ చేస్తుంది.
 ఎయిర్ కుష‌న్స్‌, యాంటీ స్కిడ్ ఫీచ‌ర్స్‌,  యాంటీ బాక్టీరియ‌ల్ సోల్ ఈ షూలో మ‌రిన్ని  ప్రత్యేక‌త‌లు. ఇక చిప్ బ్యాట‌రీని ఒక‌సారి ఛార్జింగ్ చేస్తే 60 రోజుల వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.
 ఎప్పుడొస్తుంది?
 ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి వ‌చ్చే ఈ స్మార్ట్ షూ కోసం ఎంఐ హోం లోకి వెళ్లి  ప్రీ బుకింగ్  చేసుకోవ‌చ్చు. ధ‌ర 299 యువాన్లు.. మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే దాదాపు 2,900 రూపాయ‌లు.  ప్రస్తుతానికి చైనాలో అందుబాటులోకి వ‌స్తుంది. ఆ త‌ర్వాత మిగిలిన దేశాల‌కు విస్తరిస్తారు.
 కాగా ఈ స్థాయిలో కాకపోయినా నైకీ కంపెనీ ఇంతకుముందు షూస్ లో టెక్నాలజీని మిక్స్ చేసింది. సెల్ఫ్ లేసింగ్‌ టెక్నాలజీతో ఓ షూని రిలీజ్ చేసింది. ఈ షూలో యాంకిల్ పై భాగాన ఉండే సెన్సర్ మ‌నం అందులో కాలు పెట్ట‌గానే ఆటోమేటిగ్గా లేస్ కట్టేస్తుంది. దీని ధ‌ర 50వేల వ‌ర‌కు ఉంది.
 ఆ త‌ర్వాత డిజిట్ సోల్ కంపెనీ స్మార్ట్ టెక్నాల‌జీతో  షూస్ త‌యారుచేసింది. దీని పేరు స్మార్ట్ షూ 001 . దీనిలో యాక్సిల‌రోమీట‌ర్ ఉంటుంది. ఇది షూ వేసుకున్న వ్యక్తి ఎంత‌దూరం న‌డిచాడు లేదా ప‌రిగెత్తాడు, ఎన్ని కాల‌రీలు ఖ‌ర్చయ్యాయ‌నే వివ‌రాల‌ను  రికార్డు చేస్తుంది. వీటిని ప్రత్యేక‌మైన యాప్ ద్వారా మీ సెల్‌ఫోన్‌కు పంపిస్తుంది.  ఈ షూను వాయిస్ కంట్రోల్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆటోమేటిక్‌గా టైట్ చేసుకోవ‌చ్చు.  ప్రతి షూలోనూ ఒక లిథియం అయాన్ బ్యాట‌రీ ఉంటుంది. దీన్ని ఛార్జి చేయ‌డానికి వైర్‌తో కాకుండా ఇండ‌క్షన్  ఛార్జింగ్ సిస్టం ఉంటుంది.   అయితే డిజిట్ సోల్ స్మార్ట్ షూ ధ‌ర 7వేల‌కు పైగా ఉంది.
 ఇప్పుడు రెడ్ మీ తయారుచేసిన ఈ టెక్నోషూ ధర అందుబాటులోనే ఉంది. సాధారణ షూస్ కూడా బ్రాండెడ్ అయితే కనీసం రూ.2,500.. అంతకంటే ఎక్కువ ధరలోనే ఉంటున్నాయి. వాటితో పోల్చితే టెక్నాలజీ మేళవించిన ఈ షూ రూ.2,900 ధరకే దొరకడం గొప్ప విషయమే.

 

జన రంజకమైన వార్తలు