2016వ సంవత్సరం స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి చిరస్మరణీయం గా మిగిలిపోతుంది. అనేక రకాల సరికొత్త స్మార్ట్ ఫోన్ లు ఈ సంవత్సరం విడుదల అయ్యాయి. LTE ఫోన్ లు గత సంవత్సరం నుండీ ఉన్నప్పటికీ ఈ 2016 లో మరింత ఊపును కొనసాగించాయి. ఇక VoLTE తో కూడిన జియో గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 4 జి మరింత విస్తృతం అవడం తో 4 జి ఆధారిత స్మార్ట్ ఫోన్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక స్మార్ట్ ఫోన్ ల కెమెరా ల విషయానికొస్తే అత్యద్భుతమైన మార్పులు ఇందులో చోటుచేసుకున్నాయి. స్మార్ట్ ఫోన్ ల కెమెరా యొక్క క్వాలిటీ DSLR కెమెరా లతో సరి సమానంగా వచ్చిందంటే ఈ విషయంలో ఎంత విప్లవాత్మక మార్పు చోటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. హువాయ్, LG మరియు ఆపిల్ లు అత్యుత్తమ కెమెరా ను అందించడం తో పాటు డ్యూయల్ కెమెరా ను మెయిన్ స్ట్రీం లోనికి తీసుకువచ్చాయి. కేవలం కెమెరా మాత్రమే గాక ఇంకా అనేక రకాల స్మార్ట్ ఫోన్ ఫీచర్ లలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. జియోమీ యొక్క బెజేల్ లెస్ ఫోన్, మోటో Z యొక్క మాడ్యులర్ సూపర్ పవర్స్ లాంటి ఫోన్ లు మంచి అనుభూతిని అందించాయి. లెనోవా యొక్క ఫాబ్ 2 ప్రో తో అగ్మెంటేడ్ రియాలిటీ కి మంచి ఊపు వచ్చింది. మొట్టమొదటి గూగుల్ టాంగో ఎనేబుల్డ్ ఫోన్ కూడా సిద్దమైంది.
2016 లో గూగుల్ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ ను లాంచ్ చేసింది, గూగుల్ లాంచ్ చేసిన పిక్సెల్ అనే ఈ స్మార్ట్ న్ ఆండ్రాయిడ్ ఫోన్ అత్యుత్తమమైనది గా చెప్పవచ్చు.
అయితే స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి కొన్ని వివాదాలు మరికొన్ని అనుకోని సంఘటనలు కూడా 2016 లో జరిగాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సామ్సంగ్ గాలక్సీ నోట్ 7 గురించి. ఇది విడుదల అవకముందే దీని డిజైన్ పై అనేక రకాల విమర్శలు వచ్చినప్పటికీ విజయవంతంగా మార్కెట్ లో ప్రవేశపెట్టారు. అయితే ఆ ఆనందం ఎక్కువకాలం నిలువలేదు.. ఈ ఫోన్ లన్నీ వరుసగా పేలిపోవడం ప్రారంభించాయి. దీనిఫలితంగా ఈ ఫోన్ ల యొక్క ఉత్పత్తిని సామ్సంగ్ పూర్తిగా నిలిపివేసింది. ఆపిల్ యొక్క ‘ol 3.5 mm ‘ హెడ్ ఫోన్ జాక్ యొక్క విషయం లోనూ అనేక వివాదాలు తలెత్తాయి.
ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం విడుదల అయిన స్మార్ట్ ఫోన్ లలో అత్యుత్తమ మైన టాప్ 10 ఫోన్ లను ఇక్కడ ఇస్తున్నాం .
1. గూగుల్ పిక్సెల్ XL
2. ఆపిల్ ఐ ఫోన్ 7 ప్లస్
3. సామ్సంగ్ గాలక్సీ S7/ S7 ఎడ్జ్
4. వన్ ప్లస్ 3 T
5. మోటో Z
6. జియోమీ MI Mix
7. వన్ ప్లస్ 3
8. లెనోవా K6 పవర్
9. జియోమీ రెడ్ మీ నోట్ 3
10. జియోమీ MI MAX Prime