• తాజా వార్తలు

అనుస్ ఈ-బుక్ ఈ402.. ధర 16,000,

 

పదిగంటల ఛార్జింగ్ వచ్చే ల్యాప్ టాప్

కంప్యూటర్ల వినియోగం అన్ని రంగాల్లోనూ విస్తరించింది. వీటి ఆవిష్కరణతో దేశ ప్రజలు ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగు పడ్డాయనే చెప్పాలి. విద్య, వైద్య, వ్యవసాయం, బ్యాంకింగ్‌ తదితర సేవల్లో వీటి పాత్ర కీలకం. ఈ సేవల్ని వ్యక్తిగత కంప్యూటర్లు (పీసీలు) ప్రజలకు మరింత చేరువ చేశాయి. అయితే.. ఇళ్లల్లో పీసీల వినియోగం మనదేశంలో పది శాతమే నట. చైనాలో 35 శాతం వాడుతున్నారట. దీనిని దృష్టిలో డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఆయా కంపెనీలు తక్కువ ధరలకే కంప్యూటర్లు అందిస్తున్నాయి. వీటిలో 'ఆసుస్‌ ఇండియా' ఒకటి. తక్కువ ధరకే ఈ-బుక్‌ సీరీస్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 'అనుస్‌ ఈ-బుక్‌ ఈ402' 'అనుస్‌ ఈ-బుక్‌ ఈ205ఎస్‌ఏ' అనే మోడళ్లను విడుదల చేసింది. వీటిని సులభంగా ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లు ఇంటెల్‌ డ్యూయెల్‌ కోర్‌ సెలెరాన్‌ ప్రాసెసర్లు, లేటెస్ట్‌ విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టం కలిగి ఉన్నాయి. ప్రతిసారీ పవర్‌సాకెట్ల అవసరం ఉండదు. సుమారు పది గంటలపాటు చార్జింగ్‌ ఉంటుంది. ఈ మోడళ్ల ధర రూ. 16 వేలు మాత్రమే.

వివో నుంచి 'ఎక్స్6ఎస్, ఎక్స్6ఎస్ ప్లస్'..

వివో సంస్థ 'ఎక్స్6ఎస్, ఎక్స్6ఎస్ ప్లస్' పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. వీటి ధర వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

స్పెసిఫికేషన్లు...

- 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే

- ఏకేఎం4375 32 బిట్ డీఏసీ ప్రాసెసర్

- 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

- 2600 ఎంఏహెచ్ బ్యాటరీ

- ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

- డ్యుయల్ సిమ్, 4 జీబీ ర్యామ్

- 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

- 4జీ, బ్లూటూత్ 4.0, యూఎస్‌బీ ఓటీజీ

వివో ఎక్స్6ఎస్ ప్లస్ ఫీచర్లు...

- 5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే

- ఈఎస్9028 డీఏసీ ప్రాసెసర్

- 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

- 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

- ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

- డ్యుయల్ సిమ్, 4 జీబీ ర్యామ్

- 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

- 4జీ, బ్లూటూత్ 4.0, యూఎస్‌బీ ఓటీజీ

 

జన రంజకమైన వార్తలు