ప్రస్తుతం భారత టెలికాం రంగం లో సంచలనాలను సృష్టిస్తున్న ముకేష్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ జియో కంపెనీ తమ యొక్క వెల్ కం ఆఫర్ ను మార్చ్ 2017 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఆ సమావేశం లోనే రిలయన్స్ జియో చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ జియో నుండి పూర్తి స్థాయి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కి సంబందించిన ప్రకటన కూడా చేశారు. అంటే ఇకపై వేరే నెట్ వర్క్ ల నుండి జియో కి మారిపోవచ్చు అన్నమాట.
ఈ నేపథ్యం లో అనేకమంది వినియోగదారుల మనసులో మెదలుతున్న ఒకే ఒక ప్రశ్న “ పోర్టబిలిటీ ద్వారా జియో కి మారడానికి ఇది సరైన సమయమేనా?” మీ మనసులో కూడా ఇదే ప్రశ్న ఉందా? అయితే మీ సందేహాలకు ఈ ఆర్టికల్ లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. జియో యొక్క MNP సర్వీస్ గురించీ మిగతా నెట్ వర్క్ లనుండి జియో కి ఎలా మారాలి అనే దాని గురించీ ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.
జియో కి మారడానికి ఇది సరైన సమయమేనా?
ఇది మీమీదే ఆధారపడి ఉంది. జియో యొక్క నెట్ వర్క్ లో కాల్ డ్రాప్ లు 20 శాతానికి తగ్గించబడినప్పటికీ డేటా స్పీడ్ లలో అస్థిరత అలాగే కొనసాగుతూ ఉంది. ఈ స్లో ఇంటర్ నెట్ స్పీడ్ అనే అంశాన్ని పరిష్కరించడానికి జియో ప్రయత్నిస్తునప్పటికీ దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాల్ డ్రాప్ మరియు డేటా స్పీడ్ సమస్యలు పూర్తిగా పరిష్కరించబడ్డాయి అని నమ్మకం కుదిరితే నిరభ్యంతరంగా కియో కు మారవచ్చు.
జియో కి మారడం కరక్టేనా?
పైన చెప్పినవి కేవలం మ అభిప్రాయాలు మాత్రమే. ప్రస్తుతం ఉన్న సమస్యలను అధిగమించడానికి జియో తీవ్రంగా శ్రమిస్తుంది. అతిత్వరలోనే వాటికి పరిష్కారం లభించవచ్చు. ప్రస్తుతానికైతే డేటా స్పీడ్ లాంటి వాటిని పట్టించుకోకపోతే జియో కు మారడం ఏమంత చెడ్డ ఐడియా కాదు. మంచి ఆలోచనే.
MNP అంటే ఏమిటి?
MNP అంటే అందరికీ తెలిసిన విషయమే. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ. ఇది మీ ఫోన్ నెంబర్ ను అలాగే ఉంచి మీరు వేరే నెట్ వర్క్ కు మారే విధంగా చేస్తుంది. ఇలా చేయడం వలన మీ నెంబర్ మారదు. అయితే జియో యొక్క MNP వేరు అనీ దీని వివరాలు వేరే విధంగా ఉంటాయనీ ఈ మధ్య వదంతులు బయలు దేరాయి. అయితే వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదు ని జియో ప్రకటించింది. మిగతా నెట్ వర్క్ ల పోర్టబిలిటీ ఎలా ఉంటుందో జియో కు కూడా అదేవిధంగా ఉంటుంది.
పోర్ట్ చేయడం ఎలా?
మీరు మీ నెంబర్ ను జియో కు పోర్టబిలిటీ వ్హేయాలని నిర్ణయించుకున్నారా? అయితే మీ కోసం జియో కు మారడం ఎలా అనే ప్రక్రియ ను ఇక్కడ ఇస్తున్నాం. మొదటగా మీరు మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ నుండి యూనిక్ పోర్టింగ్ కోడ్ ( UPC ) ని జనరేట్ చేయాలి. దీనికోసం మీరు మీ ఫోన్ నుండి పోర్ట్ అని టైపు చేసి మీ ఫోన్ నెంబర్ ను టైపు చేసి 1900 కి మెసేజ్ చేయాలి. అలాచేసిన కొద్ది నిమిషాల్లో మీకు ఎనిమిది అంకెల UPC కోడ్ వస్తుంది. ఈ కోడ్ వచ్చిన తర్వాత మీ దగ్గరలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ కి వెళ్లి మీ ఐడి ప్రూఫ్ మరియు మీ కోడ్ ను చూపిస్తే మిగతా ప్రాసెస్ ను వారు పూర్తిచేస్తారు.
నియమ నిబందనలు
*పోర్టింగ్ రిక్వెస్ట్ అనేది 7 రోజులలో పూర్తీ అవుతుంది.అదే సమయం లో సుమారు రెండు గంటలపాటు మీకు నో సర్వీస్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ పోర్టింగ్ స్టేజి లో ఉంది అనడానికి ఇది సూచనగా భావించవచ్చు.
*మీరు పోస్ట్ పెయిడ్ కస్టమర్ అయినట్లయితే మీ ప్రస్తుత ఆపరేటర్ తో మీకు ఉన్న బిల్ లు అన్నింటినీ క్లియర్ చేయాలి. లేకపోతే మీ పోర్టింగ్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది.
*UPC ని జనరేట్ చేసిన తర్వాత మీరు పోర్టింగ్ ప్రక్రియను 30 రోజులలోగా పూర్తీ చేయవలసి ఉంటుంది.
దీనివలన లాభాలు ఏమిటి?
దీని గురించి చెప్పేదేముంది. జియో యొక్క వెల్ కం ఆఫర్ లో ఉన్న ఉచిత అన్ లిమిటెడ్ కాల్ లు, మెసేజ్ లు మరియు డేటా అన్నీ మార్చ్ 2017 వరకూ అపరిమితంగా లభిస్తాయి.