• తాజా వార్తలు

టాప్ 10 1 TB ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్స్ మీ కోసం

  కంప్యూటర్ లు మరియు స్మార్ట్ ఫోన్ ల యుగంగా చెప్పబడుతున్న ఈ రోజుల్లో మన డేటా అంతటినీ మనం డిజిటల్ గా స్టోర్ చేసుకుంటూ ఉంటున్నాము. దీనివలన స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉండవలసిన అవసరం పెరుగుతుంది. మనం కంప్యూటర్ కానీ ల్యాప్ ట్యాప్ కానీ కొన్నపుడు 500 GB లేదా 1 TB సామర్థ్యం ఉన్న ఇంటర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ మనకు వాటిలోనే ఉంటుంది. అది సరిపోక మనకి ఇంకా స్టోరేజ్ కావాలి అంటే అలాంటి సందర్భాలలో ఎక్స్ టర్నల్ స్టోరేజ్ డివైస్ లను ఉపయోగిస్తాము. వీటినే ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ లు అంటారు. వీటిని పెన్ డ్రైవ్ మాదిరిగా మన కంప్యూటర్ కు సెట్ చేసుకుని ఉపయోగించవచ్చు. మనకు ముఖ్యమైన డేటా అంతటినీ వీటిలో స్టోర్ చేసుకోవచ్చు. అలాంటి హార్డ్ డిస్క్ లలో 1 TB స్టోరేజ్ ను అందించే  టాప్ 10 ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం.

లెనోవా 1 TB హార్డ్ డ్రైవ్

లాప్ ట్యాప్ లు మరియు యాక్సేసరీ ల విషయం లో లెనోవా ను అత్యంత నమ్మకమైన బ్రాండ్ గా చెబుతారు. ల్యాప్ ట్యాప్ ల విషయం లో ఒక మంచి బ్రాండ్ గా పేరుపడిన లెనోవా యాక్సేసరీ ల విషయం లో కూడా అదే పేరును నిలబెట్టుకునే ప్రయత్నం లో ఉంది. లెనోవా యొక్క 1 TB ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్ అనేది ఇండియా లో దొరికే హార్డ్ డిస్క్ లన్నింటిలోనూ అత్యంత చవకైనది గా చెప్పవచ్చు.ఇది యు ఎస్ బి 3.0 కనెక్టివిటీ తో లభిస్తుంది. ఇది మామూలు యు ఎస్ బి 2.0 కంటే 5 రెట్లు వేగంగా పనిచేస్తుంది. మీ సిస్టం యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇది సుమారు 500 MBPS స్పీడ్ తో ఫైల్ లను ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అదే మామూలు యు ఎస్ బి 2.0 అయితే కేవలం 20-25 MBPS వేగంతో పనిచేయగా ఇది సుమారు 100 MBPS స్పీడ్ ను అందిస్తుంది. మీ సిస్టం సామర్థ్యం బాగుంటే ఇంతకుముందు  చెప్పిన వేగాన్ని కూడా అందిస్తుంది. ఇది మాత్రమే గాక లెనోవా ఒక సంవత్సరం వారంటీ ని  అందిస్తుంది.

లెనోవా F309

లెనోవా నుండి వస్తున్న మరొక బడ్జెట్ హార్డ్ డిస్క్ ఈ లెనోవా F 309 . ఇది రూ 5000 ల లోపే లభిస్తుంది. ఇది కూడా యు ఎస్ బి 3.0 తో లభిస్తూ అత్యంత ఎక్కువ స్పీడ్ ను అందిస్తుంది. ఇది మెటల్ తో తయారు చేయబడి మంచి లుక్ ను కలిగిఉంటుంది. దీని బరువు కేవలం 209 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఈ విభాగంలో ఇదే అత్యంత తేలికైనది గా చెప్పుకోవచ్చు. దీనిని విండోస్ ఆపరేటింగ్ సిస్టం తో పాటు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టం లో కూడా ఉపయోగించవచ్చు. దీనితో ఇది ఇండియా లోనే అత్యుత్తమ 1 TB ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ లలో ఒకటిగా నిలిచింది.

తోషిబా కన్వియో బేసిక్స్

ఒకప్పుడు ఇది ప్రముఖ కంపెనీ గా ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీ నుండి వచ్చిన ల్యాప్ ట్యాప్ లు మార్కెట్ ను ఏలాయి. కాలం గడిచేకొద్దీ ఈ కంపెనీ పట్ల వినియోగదారులలో ఆదరణ తగ్గి దీని ప్రత్యర్థులతో పోలిస్తే మార్కెట్ షేర్ గణనీయంగా తగ్గిపోయింది. అయినా ఇది ఇంకా బిజినెస్ చేయడమే గాక క్వాలిటీ లో ఏ మాత్రం రాజీ పడకుండా అదే స్థాయి ఉత్పాదనలను అందిస్తుంది.ఇక ఈ విభాగం లో ఇది 3.0 యు ఎస్ బి సపోర్ట్ తో ఉండే 1 TB హార్డ్ డిస్క్ ను అందిస్తుంది. దీని ధర కూడా రూ 5000/- ల లోపే ఉంటుంది. ఇది ఒక సంవత్సరం వారంటీ ని అందిస్తుంది. ఇది రివ్యూ లకు అతీతంగా పనిచేస్తుంది. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై చాలా చక్కగా పనిచేస్తుంది. అదే మాక్ బుక్ కోసం అయితే దీనిని రీ ఫార్మాట్ చేసి మళ్ళీ ఉపయోగించాలి.

సోనీ HD- B1

మ్యూజికల్ యాక్సేసరీ లకు పేరుగాంచిన కంపెనీ అయిన సోనీ కూడా 1 TB ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ ను అందిస్తుంది. ఇది కూడా రూ5000/- లలోపే లభిస్తుంది. ఇది బ్లాక్ కలర్ మరియు మెటల్ బాడీ తో ఉంది చూడడానికి మంచి లుక్ ను కలిగిఉంటుంది. ఇది కూడా యు ఎస్ బి 3.0 తో లభిస్తూ వేగంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది 3 సంవత్సరాల వారంటీ తో లభిస్తుంది. ఈ విషయం లో దీని పోటీదారులతో పోలిస్తే ఇది బెటర్ పొజిషన్ లో ఉంది.

సీ గేట్ STEA 1000400

ఇండియా లో పోర్టబుల్ హార్డ్ డిస్క్ ల విభాగం లో ఈ సీ గేట్ అనేది ఒక ప్రముఖ కంపెనీ. అనేకమంది వినియోగదారుల మొదటి ఎంపిక ఈ సి గేట్ కంపెనీ. ఇది కూడా యు ఎస్ బి 3.0 ను అందిస్తూ రూ 5000/- ల లోపే లభిస్తుంది. ఇది కేవలం విండోస్ మరియు మాక్ లతో మాత్రమే గాక ఎక్స్ బాక్స్ తో కూడా కంపాటిబుల్ అయ్యే విధంగా ఉంటుంది. అంటే మీరు ఈ డివైస్ ను ఎక్స్ బాక్స్ కు కనెక్ట్ చేసి ఈ హై స్పీడ్ యు ఎస్ బి 3.0 ద్వారా అనేకరకాల గేమ్ లను అప్ లోడ్ చేసుకోవచ్చు అన్నమాట.

HPK6A93AA

 దీనిపేరు ఎదో ఒక ఫ్యాక్స్ మిషన్ పేరు లాగా అనిపిస్తుంది. కానీ ఇది HP నుండి వచ్చిన తక్కువధరలో లభించే హార్డ్ డిస్క్. HP కంపెనీ కొన్ని అత్యుత్తమ క్వాలిటీ ఉత్పత్తులను అందిస్తూ అతి పెద్ద మార్కెట్ షేర్ నూ మంచి పేరును కలిగి ఉంది. ల్యాప్ ట్యాప్ లు మరియు యాక్సేసరీ ల విభాగం లో ఇది ఒక టాప్ బ్రాండ్ గా ఉన్నది. ఇదే తరహా క్వాలిటీ ని HP తన 1 TB ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ లోనూ అందిస్తుంది. ఇది అల్యూమినియం బాడీ తో లభిస్తూ మంచి లుక్ ను అందిస్తుంది. ఇది కూడా యు ఎస్ బి 3.0 తో లభిస్తుంది.

సోనీ HD- SL1

మంచి లుక్ ఉన్న ఉత్పత్తులను అందించడం లో సోనీ మంచి పేరును సంపాదించుకుంది. ఇదే తరహా లుక్ ను ఇది ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ లకు కూడా అందిస్తుంది. మిగతా వాటితో పోలిస్తే ఇది ఒక విషయం లో మెరుగ్గా ఉంటుంది. ఇది పాస్ వర్డ్ తో లభిస్తుంది. అంటే ఒకవేళ మీరు దీనిని ఎక్కడైనా పోగొట్టుకున్నా సరే వేరే వాళ్ళు మీ డేటా ను చూసే వీలు లేకుండా ఇది పాస్ వర్డ్ ను కలిగిఉంటుంది. ఈ పాస్ వర్డ్ ను మీరు మీకు నచ్చిన రీతిలో సెట్ చేసుకోవచ్చు.దీనికి ఉన్న సెక్యూరిటీ ఫీచర్ లు దీనిని టాప్ ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్ లలో ఒకటిగా నిలబెడుతున్నాయి.

తోషిబా కాన్వియో ఏరో కాస్ట్

తోషిబా ఉత్పాదన అయిన కాన్వియో గురించి ఇంతకుముందే మనం చెప్పుకున్నాము కదా మళ్ళీ ఇక్కడ ఉందేంటి అనుకోవచ్చు. ఇది వైర్ లెస్ హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇది మీ ల్యాప్ ట్యాప్ లేదా కంప్యూటర్ కు వైర్ లెస్ గా కనెక్ట్ అయి ఉంటుంది. అంతేగాక దీనిని మీరు మీ స్మార్ట్ ఫోన్ కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి మేరు చేయవలసిందల్లా మీ స్మార్ట్ ఫోన్ లో తోషిబా HDD అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవడమే. ఇది మీ హార్డ్ డిస్క్ కు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. మీ SD కార్డు ను కూడా ఈ ఆహరద్ డిస్క్ లో ఉంచవచ్చు. ఇది 5 గంటల ఎక్కువ బ్యాక్ అప్ ను అందిస్తుంది. దీని ధర రూ 10,000/- లలోపు ఉంటుంది.

సీగేట్ వైర్ లెస్ ప్లస్

మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ తరహా మార్కెట్ లో సి గేట్ కంపెనీ రారాజుగా వెలుగొందుతుంది. మనం ఇంతకుముందు యు ఎస్ బి 3.0 డ్రైవ్ గురించి చెప్పుకున్నాము. ఇది వైర్ లెస్ గా పనిచేస్తుంది. దీనికి సంబంధించి మరొక గొప్ప విషయం ఏమిటంటే ఒకేసారి 3 పరికరాలకు ఇది కనెక్ట్ అయి ఉండగలదు. సింగల్ రీఛార్జి తో 10 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ ను అందిస్తుంది.

WD మై పాస్ పోర్ట్ వైర్ లెస్

అత్యుత్తమ 1 TB ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ ల విషయం లో ఈ WD ను ఒక ప్రముఖ బ్రాండ్ గా చెప్పుకోవచ్చు. ఇది మై పాస్ పోర్ట్ సిరీస్ లో  వైర్ లెస్ హార్డ్ డిస్క్ డ్రైవ్ లని అందిస్తున్నాయి.వీటి ధర రూ 12,000 ల రేంజ్ లో ఉంటుంది. చూడడానికి కొంచెం ఎక్కువ ధర అనిపించినా దీని ఫీచర్ లు చుస్తే మాత్రం ఆ మాత్రం ధర న్యాయమే అనిపిస్తుంది అంటున్నారు దీని ఉత్పాదకులు. మీ SD కార్డు ను ఇందులో ఉంచవచ్చు, మీ ఆండ్రాయిడ్, విండోస్, మాక్ మరియు ఐఒఎస్ స్మార్ట్  ఫోన్ కు దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు, దీనిని ఒకేసారి నాలుగు రకాల పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు.

 

 

జన రంజకమైన వార్తలు