• తాజా వార్తలు

లాప్‌టాప్‌ను చోరీల నుంచి కాపాడుకునేందుకు కొన్ని యాంటీ తెఫ్ట్ లాక్స్‌

లాప్‌టాప్ ద‌గ్గ‌ర ఉందంటే ఒక ఆనందంతో పాటు కొంచెం భ‌యం కూడా ఉంటుంది. దీనికి కార‌ణం దొంగ‌లే. ఖ‌రీదైన లాప్‌టాప్‌ల‌ను కొట్టేయ‌డానికి వీళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఏమాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్నామా.. మ‌న లాప్‌టాప్ మాయం అయిన‌ట్లే. అలా ఏమ‌ర‌పాటుగా ఉండి ఎంతోమంది లాప్‌టాప్‌లు పోగొట్టుకున్నారు. ముఖ్యంగా బ్యాచ్‌ల‌ర్ రూముల్లో ఈ లాప్‌టాప్ దొంగ‌త‌నాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.  లాప్‌టాప్ ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డం, తీసుకెళ్లేందుకు సుల‌భంగా ఉండ‌డం, బ‌య‌ట అమ్మితే మంచి రేటే వ‌స్తుండ‌డంతో దొంగ‌ల గురి వీటిపై ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఇలాంటి దొంగ‌త‌నాల‌ను నివారించ‌డానికి కొన్ని యాంటీ తెఫ్ట్ లాక్స్  మ‌రియు సెక్యూరిటీ కేబుల్స్ ఉన్నాయి. వాటిలో ఏడు కీల‌క‌మైన వాటి గురించి తెలుసుకుందామా!

కెన్నింగ్‌స్ట‌న్ మైక్రో సేవ‌ర్ నోట్‌బుల్ లాక్‌
కెన్నింగ్‌స్ట‌న్ కంపెనీ త‌యారు చేసిన మైక్రో సేవ‌ర్ యాంటీ తెఫ్ట్ కేబుల్  నోట్‌బుక్స్ కోసం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 6 అడుగుల పొడ‌వుండే ఈ కేబుల్‌..  కార్బ‌న్‌, టెంప‌ర్డ్ స్టీల్ కోర్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేశారు. దీనికి ఒక టీ ఆకారంలో ఉండే లాక్ ఉంటుంది. దీనికి ఒక పిన్ ఉంటుంది. మీరు లాపీకి అటాచ్ చేసుకుంటే చాలా మీరు తప్ప ఎవ‌రూ ఉప‌యోగించ‌లేరు. దీని ధ‌ర ప్ర‌స్తుతం 19 డాల‌ర్లుగా ఉంది. 


కెన్నింగ్‌స్ట‌న్ కాంబినేష‌న్ లాప్‌టాప్ లాక్‌
చాలా యంటీ తెఫ్ట్ లాప్‌టాప్‌ల‌కు లేని డిజైన్ కెన్నింగ్‌స్ట‌న్ కాంబినేష‌న్ లాప్‌టాప్ లాక్‌కు ఉంది. అమెజాన్‌లో 24 డాల‌ర్ల‌కు ల‌భ్యమ‌వుతున్న ఈ కేబుల్‌.. మీ లాప్‌టాప్‌ను కాపాడ‌డంలో ముందుంటుంది. దీన్ని లాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తే చాలు లాప్‌టాప్‌ను తెర‌వ‌డం చాలా క‌ష్టం. 10 వేల పాజిబుల్ కాంబినేష‌న్స్‌, కే లెస్ 4 వీల్ దీనిలో ఉంది.

సెండెట్ బ్లాక్ లాప్‌టాప్ కాంబినేష‌న్ లాక్ సెక్యూరిటీ కేబుల్‌
సెండెట్ యాంటీ థెప్ట్ లాప్‌టాప్ కేబుల్ కూడా కెన్నింగ్స్ట‌న్  లాగే లాప్‌టాప్‌ను  లాక్ చేసి ఉంచుతుంది. దీనికి ఉండే బ‌ల‌మైన సెక్యురిటీ కేబుల్‌ను ఛేదించ‌డం చాలా క‌ష్టం. బ్రిఫ్‌కేస్‌లా దీనికి ఒక పిన్ పెట్టుకుంటే చాలు. ఎవ‌రూ ఓపెన్ చేయ‌లేరు.  దీనికి ఉండే కేబుల్ స్టాండ‌ర్డ్ లెంగ్త్‌తో (6 అడుగుల పొడ‌వు) ఉంటుంది. జింక్ మిశ్ర‌మంతో దీన్ని త‌యారు చేస్తారు. ఇది కేవ‌లం లాప్‌టాప్‌ల‌కు మాత్ర‌మే కాదు ఎల్‌సీడీ పాస్మా స్క్రీన్‌ల‌ను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది.

క్లిక్ సేఫ్ కాంబినేష‌న్ లాక్‌
కెన్నింగ‌స్ట‌న్‌లో వ‌చ్చిన మ‌రో యాంటీ తెఫ్ట్ ప‌రిక‌రం క్లిక్ సేఫ్ కాంబినేష‌న్ లాప్‌టాప్ లాక్‌.  దీనిలో మిగిలిన వాటితో పోలిస్తే అడ్వాన్స్‌డ్ యాంటీ తెఫ్ట్ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అంటే మీరు ఒక పిన్‌ను పెట్టుకుని మ‌ర్చిపోతే.. ఫర్ గెట్ పాస్‌వ‌ర్డ్ ఆప్ష‌న్ ద్వారా మీరు తిరిగి ఆ పాస్‌వ‌ర్డ్‌ను పొందే అవ‌కాశం ఇందులో ఉంది. అంటే దీన్ని ఆన్‌లైన్‌లో మేనేజ్ చేసే అవ‌కాశం ఉంటుంది. అంతేకాక ఈ ప్రాడెక్ట్‌కు లైఫ్ టైమ్ వారెంటీ కూడా ఉంది. 

టార్గ‌స్ అల్ట్రా  మాక్స్ కేబుల్ లాక్‌
టార్గ‌స్ అల్ట్రా మాక్స్ లాప్‌టాప్ కేబుల్ కూడా లాప్‌టాప్‌ల‌ను చోరుల బ‌రి నుంచి కాపాడేందుకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనికి కాస్త ఎక్కువ ధ‌ర పెట్టాల్సి ఉంటుంది. రూ.50 డాల‌ర్ల నుంచి ఇది మార్కెట్లో దొరుకుతుంది. దీనిలో ఉండే ఇండ‌స్ట్రీయ‌ల్ స్ట్రెంగ్త్ కోటెడ్ కేబుల్  చాలా బ‌లంగా ఉండి లాప్‌టాప్‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంది. ఈ కేబుల్ 8 ఎంఎం మందంతో త‌యారు చేశారు. దొంగ‌లు దీన్ని బ్రేక్ చేయ‌డం చాలా చాలా క‌ష్టం.

జన రంజకమైన వార్తలు